Krishna District: ఓర్నీ.. కొట్టకుండానే చేతి పంపుల నుంచి ధారలుగా ఉబికివస్తోన్న నీరు

అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామంలో చేతి పంపులనుంచి నీరు ధారాళంగా వస్తోంది. ఎవరూ కొట్టకుండానే నీళ్లు ఉప్పొంగి రావడంతో స్థానికులు అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Krishna District: ఓర్నీ.. కొట్టకుండానే చేతి పంపుల నుంచి ధారలుగా ఉబికివస్తోన్న నీరు

|

Updated on: Sep 06, 2024 | 3:09 PM

చేతిపుంపును చేతితో కొడితేనే నీళ్లు వస్తాయ్‌.. కానీ.. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. పులిగడ్డ గ్రామంలోని నాలుగు పంపుల్లో కొట్టకుండానే ధారాళంగా నీళ్లు వస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామంలో భారీగా వరద నీరు నిలిచింది. దాంతో.. భూగర్భ జలాలు అధికంగా పెరిగాయి. ఈ క్రమంలోనే.. చేతిపుంపులను కొట్టకుండానే నీళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలకు భూగర్భ జలాలు ఓ రేంజ్‌లో పెరిగాయ్.. దీంతో.. పొలాలోన్ని బోరు బావుల నుంచి కూడా మోటార్ ఆన్ చేయకుండానే నీరు ఉబికివస్తున్నాయ్. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

 

Follow us