Vande Bharat: పదే పదే అదే ఆలస్యం.. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ప్రయాణీకులకు తప్పని తిప్పలు..
వందేభారత్ ప్రయాణీకులకు మళ్లీ నిరాశే మిగిలింది. గత రెండు రోజులుగా విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.

వందేభారత్ ప్రయాణీకులకు మళ్లీ నిరాశే మిగిలింది. గత రెండు రోజులుగా విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవాళ జూన్ 15న కూడా విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ రైలును రీ-షెడ్యూల్ చేశారు రైల్వేశాఖ అధికారులు. ఈ ట్రైన్‌ను సంబంధించిన మారిన టైమింగ్స్‌ను ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ గురువారం(జూన్ 15) ఉదయం 5.45 గంటలకు బదులుగా ఉదయం 9.30 గంటలకు బయల్దేరుతుంది. నిన్న అనకాపల్లి – తాడి మధ్య గూడ్స్ పట్టాలు తప్పడంతో 4 గంటల ఆలస్యంగా సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన వందేభారత్.. అర్ధరాత్రికి విశాఖపట్నం స్టేషన్‌కు చేరుకుంది. ఇదే కారణమని రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాల్సిందిగా కోరారు. కాగా, ఈరోజు తిరుగు ప్రయాణంలో నడిచే సికింద్రాబాద్-విశాఖ(20834) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కూడా నడవచ్చునని తెలుస్తోంది.
Important Train related Information RE-SCHEDULING OF 20833 Visakhapatnam-Secunderabad Vandebharat express leaving Visakhapatnam on 15.06.2023 @RailMinIndia @EastCoastRail @SCRailwayIndia @drmvijayawada @drmsecunderabad #Visakhapatnam pic.twitter.com/caLJaMrdTW
— DRMWALTAIR (@DRMWaltairECoR) June 14, 2023