ఏపీ వాసులకు ముఖ్య గమనిక.. రాజమండ్రి రైల్వే-రోడ్ బ్రిడ్జ్‌పై ఆ వాహనాలు నిషేధం.. ఎందుకంటే..?

| Edited By: శివలీల గోపి తుల్వా

Jul 25, 2023 | 12:31 PM

Rajahmundry: ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కం రైల్ బ్రిడ్జి డామేజ్ అయ్యింది. ఈ బ్రిడ్జిపై లారీలు, బస్సుల రాకపోకలను శాశ్వతంగా నిలిపి వేశారు. బ్రిడ్జి డెక్ జాయింట్‌లు ఉన్న ప్రాంతం దెబ్బతింటున్న దృష్ట్యా , ట్రాఫిక్ రద్దీ, వంతెన భద్రత దృష్ట్యా ఆర్ అండ్ బి అధికారులు

ఏపీ వాసులకు ముఖ్య గమనిక.. రాజమండ్రి రైల్వే-రోడ్ బ్రిడ్జ్‌పై ఆ వాహనాలు నిషేధం.. ఎందుకంటే..?
Rajamundry
Follow us on

రాజమండ్రి న్యూస్, జూలై 25: ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన రాజమండ్రి – కొవ్వూరు రోడ్ కం రైల్ బ్రిడ్జి డామేజ్ అయ్యింది. ఈ బ్రిడ్జిపై లారీలు, బస్సుల రాకపోకలను శాశ్వతంగా నిలిపి వేశారు. బ్రిడ్జి డెక్ జాయింట్‌లు ఉన్న ప్రాంతం దెబ్బతింటున్న దృష్ట్యా , ట్రాఫిక్ రద్దీ, వంతెన భద్రత దృష్ట్యా ఆర్ అండ్ బి అధికారులు చేసిన సూచనలు మేరకు లారీ లు, బస్సులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజమండ్రి -కొవ్వూరులను అనుసంధానం చేస్తూ అందుబాటులో ఉన్న రోడ్ కం రైల్ వంతెన పై లారీలు, బస్సుల ట్రాఫిక్ ను నిలిపి వేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత ఉత్తర్వులు మేరకు ఈ నిషేధజ్ఞులు ఆదివారం సాయంత్రం నుండి అమలులోకి వచ్చాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రోడ్ కం రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయిన తరువాత 1974 నుంచి వాహనాల రాకపోకలు సాగించడానికి అనుమతించడం జరిగింది. మూడున్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి జీవిత కాలం 65 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చి 49 సంవత్సరాలు పూర్తి అవుతున్నది.

అయితే రోజురోజుకు విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతున్న వర్తమాన సంఘటనలు నేపథ్యంలో, ఈ వంతెనపై భారీ లోడుతో కూడిన వాహనాలు నడపడం వల్ల, డెక్ జాయింట్‌లపై ఉన్న ప్రాంతాల్లో దెబ్బతింటున్న దృష్ట్యా , ట్రాఫిక్ రద్దీ వంతెన భద్రత దృష్ట్యా
ఆర్ అండ్ బి అధికారులు చేసిన సూచనలు మేరకు లారీ లు, బస్సులకు ఈ వంతెన మార్గం ద్వారా తిరగటాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ వంతెన మనుగడ, మరిన్ని సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో ఉండే విధానంలో భాగంగా టూ వీలర్స్, మూడు చక్రాల వాహనాలు, కార్లు తిరిగేందుకు ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడం జరిగింది.
ఈ బ్రిడ్జి మీదుగా 10.2 టన్నుల బరువు మించి ఉన్న వాహనాలు తిరిగితే వంతెన దెబ్బ తినే అవకాశం ఉందని 2007,2011 లో నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ దృష్ట్యా ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. అనుమతించిన వాహనాలు వంతెన మీద తిరిగేలా మధ్యలో పోల్స్ ఏర్పాటు చెయ్యాలని కలెక్టర్ ఆదేశించారు.

తుర్పు గోదావరి జిల్లా కి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, , జిల్లా రవాణా అధికారి, జిల్లా ప్రజా రవాణా అధికారి (ఆర్టీసీ) వారికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కొవ్వూరు – రాజమండ్రి మీదుగా ప్రయాణం చేసే భారీ వాహన దారులు , బస్సులు జాతీయ రహదారి మీద ఉన్న నాలుగు లైనుల వంతెన గామన్ బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగించవలసి ఉంటుంది.
అయితే ఆకస్మికంగా బస్సుల రాకపోకలు నిలిపి వేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చూట్టు తిరిగి బస్సులో వెళ్లవలసి రావడంతో దూరభారంతోపాటు ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..