AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాలు, ఎండలు.. ఏపీలో వాతావరణం ఎలా ఉంటుంది..? రుతుపవనాలపై లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, వర్షాలతో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తుండగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని పేర్కొంది.

వర్షాలు, ఎండలు.. ఏపీలో వాతావరణం ఎలా ఉంటుంది..? రుతుపవనాలపై లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Weather Update
Shaik Madar Saheb
|

Updated on: Jun 02, 2026 | 1:23 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండంగా.. మరో వైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ రుతుపవనాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం, 10° ఉత్తర అక్షాంశం /60° తూర్పు రేఖాంశం, 9° ఉత్తర అక్షాంశం /65° తూర్పు రేఖాంశం, 8.5° ఉత్తర అక్షాంశం /70° తూర్పు రేఖాంశం, 8° ఉత్తర అక్షాంశం /75° తూర్పు రేఖాంశం, 7.8° ఉత్తర అక్షాంశం /78° తూర్పు రేఖాంశం, 8° ఉత్తర అక్షాంశం /80° తూర్పు రేఖాంశం, 10°ఉత్తర అక్షాంశం/80° తూర్పు రేఖాంశం ,13° ఉత్తర అక్షాంశం /87° తూర్పు రేఖాంశం, 16° ఉత్తర అక్షాంశం /90° తూర్పు రేఖాంశం19° ఉత్తర అక్షాంశం /93° తూర్పు రేఖాంశం 22° ఉత్తర అక్షాంశం /97° తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. జూన్ 4వ తేదీ నాటికి, నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.. తూర్పు మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి విదర్భ, తెలంగాణ, రాయలసీమల మీదుగా ఈశాన్య తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతొ కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ :-

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గమనిక ;- కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం – రాయలసీమ ప్రాంతాలలో రాబోయే 5 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో పెద్దగా మార్పు లేకుండా 2-3℃ తగ్గే వకాశము వుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us