Special Trains: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. కాచిగూడ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్ల వివరాలు

|

Jun 15, 2022 | 10:47 AM

Railway News: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది.

Special Trains: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. కాచిగూడ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్ల వివరాలు
Follow us on

Railway News: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. కాచిగూడ – తిరుపతి(Kacheguda – Tirupati) మధ్య ఈ నెల 15(బుధవారం) నుంచి 18 తేదీ మధ్య నాలుగు ట్రిప్‌లు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. జూన్ 15, 17 తేదీల్లో ప్రత్యేక రైలు (నెం.07597) కాచిగూడ నుంచి సాయంత్రం 07.00 గం.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.50 గం.లకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే జూన్ 16, 18 తేదీల్లో ప్రత్యేక రైలు (నెం.07598) తిరుపతి నుంచి ఉదయం 10.10 గం.లకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 09.55 గం.లకు కాచిగూడకు చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్, లగేజీ కమ్ బ్రేక్ వ్యాన్ కోచ్‌లు ఉండనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ ప్రత్యేక రైళ్లు ఆయా రైల్వే స్టేషన్‌లో ఏ టైమ్‌కి చేరుకుని బయలుదేరుతాయో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు..

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు, దర్శనం చేసుకుని హైదరాబాద్‌కు తిరిగొచ్చే భక్తులకు సౌలభ్యంగా రైల్వే శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పుడు మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించడం విశేషం.

హైదరాబాద్ – కాలబుర్గి మధ్య ప్రత్యేక రైళ్లు

అలాగే ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ – కాలబుర్గి (గుల్బర్గా) – హైదరాబాద్ మధ్య దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..