Purandeshwari: చీపురుపట్టి స్వచ్ఛ భారత్ నిర్వహించిన దగ్గుపాటి పురంధేశ్వరి.. కీలక సందేశం..

రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే నేతలు స్వగ్రామాల్లో పండుగ సంబరాలు చేసుకుంటున్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు.

Purandeshwari: చీపురుపట్టి స్వచ్ఛ భారత్ నిర్వహించిన దగ్గుపాటి పురంధేశ్వరి.. కీలక సందేశం..
Purandheshwari

Edited By:

Updated on: Jan 15, 2024 | 1:45 PM

రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే నేతలు స్వగ్రామాల్లో పండుగ సంబరాలు చేసుకుంటున్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతోపాటు వారి కుటుంబసభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడిపారు. మరోవైపు ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుండటం శుభసూచికమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్లజిల్లా కారంచేడులోని శివాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శివాలయంలో పురంధేశ్వరి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేకపూజలు నిర్వహించారు.

అనంతరం శివాలయం ప్రాంగణంలో చీపుర్లు పట్టి ఊడ్చి, ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి మనుమలు కూడా పాలుపంచుకున్నారు. దశాబ్దాల కాలంగా సమస్యగా ఉన్న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుపుకోవడం సంతోషాదాయకమని ఆమె తెలిపారు. రామమందిర నిర్మాణం ప్రజల చిరకాలవాంఛగా ఉందని, ప్రధాని మోదీ వల్ల ఇది సాధ్యమయిందని పేర్కొన్నారు. ప్రతిరోజు ఇంట్లో ఎలా శుభ్రంగా ఉంచుకుని పూజచేస్తామో.. అలాగే దేవాలయాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రామమందిరాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రతి గ్రామంలో దేవాలయాలను శుభ్రం చేసే కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..