AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వృద్దులు, దివ్యాంగులకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం..తేదీలు ఖరారు!

తిరుమల వెంకటేశుని దర్శనం కోసం ఇకపై వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు.. ఇబ్బంది పడాల్సిన పనిలేదు. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. నెలలో రెండు రోజుల పాటు వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీటీడీ గతంలో నిర్ణయించింది. ఈ కార్యక్రమ దిగ్విజయంగా నడుస్తుంది కూడా.  ఇందులోభాగంగా అక్టోబరు 15, 29 తేదీల్లో మంగ‌ళ‌వారం వయోవృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ […]

వృద్దులు, దివ్యాంగులకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం..తేదీలు ఖరారు!
Ram Naramaneni
|

Updated on: Oct 10, 2019 | 4:30 PM

Share

తిరుమల వెంకటేశుని దర్శనం కోసం ఇకపై వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు.. ఇబ్బంది పడాల్సిన పనిలేదు. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. నెలలో రెండు రోజుల పాటు వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీటీడీ గతంలో నిర్ణయించింది. ఈ కార్యక్రమ దిగ్విజయంగా నడుస్తుంది కూడా.  ఇందులోభాగంగా అక్టోబరు 15, 29 తేదీల్లో మంగ‌ళ‌వారం వయోవృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ రెండు రోజుల్లో ఉదయం 10 గంటల స్లాట్‌కు 1,000, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటల స్లాట్‌కు 1,000 టోకెన్లు జారీ చేస్తారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ ప్రకటించింది.

అలాగే ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు అక్టోబరు 16, 30 తేదీల్లో బుధవారం ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 1.30 గంటలకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఇక మీదట ప్రతినెల 2 రోజులు వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు స్వామివారిని దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం