Modi Bhimavaram Tour: భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన.. భారీగా పోలీసు ఆంక్షలు

|

Jul 02, 2022 | 8:39 AM

Modi Bhimavaram Tour: ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల పర్యనటలో భాగంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 2న హైదరాబాద్‌కు రానున్న మోడీ..

Modi Bhimavaram Tour: భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన.. భారీగా పోలీసు ఆంక్షలు
Follow us on

Modi Bhimavaram Tour: ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల పర్యనటలో భాగంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 2న హైదరాబాద్‌కు రానున్న మోడీ.. 4వ తేదీన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. దీంతో భారీగా పోలీసు ఆంక్షలు ఉండనున్నాయి. ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేయనున్నారు. రేపు కాళ్ళ మండలం నుండి భీమవరం వైపుకు స్కూల్, ప్రయివేటు వాహనాలను అనుమతించడం లేదు. భద్రతా చర్యల్లో భాగంగా 4న షాపులనులను స్వచ్చందంగా మూసివేయాలని వ్యాపారులు నిర్ణయించారు. భీమవరంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హోట్లల్స్, వాణిజ్య సముదాయాలను పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆధీనంలోకి తీసుకున్నారు.

ఈనెల 4న ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు అధికారులు. ఆయన హైదరాబాద్‌లోని బేంగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 9.29గంటలకు బయలుదేరి 10.10కు విజయవాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.15 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 10.50 గంటలకు భీమవరంకు చేరుకుంటారు. 10.55కు హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక వాహణంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జాతీనుద్దేశించి ప్రసంగిస్తారు మోడీ. ఇక 12.30 హెలికాప్టర్‌లో బయలుదేరి 1.05 గంటలకు విజయవాడకు చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి