Prakasam District Road Accident: విషాదం.. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Prakasam District Road Accident: ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్టూరు వద్ద జాతీయ రహదారిపై లారీని వెనుక ...
Prakasam District Road Accident: ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్టూరు వద్ద జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. తిరుమల నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: