Andhra Pradesh: వైసీపీలో కొత్త పంచాయితీ.. జగన్ ఓకే.. ఆయన మాత్రం వద్దంటున్న పార్టీ శ్రేణులు..

|

Apr 11, 2023 | 12:30 PM

ఏపీ వ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య స్టిక్కర్ల స్టంట్‌ నడుస్తుంటే.. రాజంపేట వైసీపీలో మాత్రం ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిపైనే పోస్టర్ల యుద్ధం మొదలుపెట్టారు సొంతపార్టీలోని అసమ్మతి నేతలు. ఎమ్మెల్యే చేతిలో మోసపోయిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అని ఆ పోస్టర్లు వేశారు. వీటిని రాజంపేటలోని ప్రధాన ప్రాంతాల్లో అంటించడంతో స్థానికంగా అధికారపార్టీలో కలకలం రేగుతోంది.

Andhra Pradesh: వైసీపీలో కొత్త పంచాయితీ.. జగన్ ఓకే.. ఆయన మాత్రం వద్దంటున్న పార్టీ శ్రేణులు..
Ycp
Follow us on

ఏపీ వ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య స్టిక్కర్ల స్టంట్‌ నడుస్తుంటే.. రాజంపేట వైసీపీలో మాత్రం ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిపైనే పోస్టర్ల యుద్ధం మొదలుపెట్టారు సొంతపార్టీలోని అసమ్మతి నేతలు. ఎమ్మెల్యే చేతిలో మోసపోయిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అని ఆ పోస్టర్లు వేశారు. వీటిని రాజంపేటలోని ప్రధాన ప్రాంతాల్లో అంటించడంతో స్థానికంగా అధికారపార్టీలో కలకలం రేగుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మా నమ్మకం నువ్వే జగన్‌ అనే క్యాంపెయిన్‌ చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి గోడలపై స్టిక్కర్లు అంటిస్తున్నారు. రాజంపేట వైసీపీలో మాత్రం.. ఎమ్మెల్యే మేడాపై వ్యతిరేకంగా ఉన్న వారు.. మా నమ్మకం నువ్వే జగన్‌ అన్నా.. కానీ ఎమ్మెల్యే మేడాపై నమ్మకం లేదని పోస్టర్లు వేశారు. కొద్దిరోజులుగా రాజంపేటలో ఎమ్మెల్యే మేడాపై అసమ్మతి పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దని ఓపెన్‌గానే వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు నాయకులు. ఇప్పుడు పోస్టర్ల రూపంలో తమ వ్యతిరేకతను చాటుకున్నారు.

ఏపీలో వైసీపీ స్టిక్కర్ల ప్రచారానికి పోటీగా తిరుపతిలో నమ్మకం లేదు జగన్‌ అని జనసేన.. కృష్ణా జిల్లాలో వైసీపీపై విమర్శలు చేస్తూ టీడీపీ పోటీగా స్టిక్కర్ల యుద్ధం ప్రారంభించాయి. వీటికి భిన్నంగా రాజంపేట వైసీపీలో సొంత ఎమ్మెల్యేపైనే నమ్మకం లేదని పోస్టర్లు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం జగన్‌పై నమ్మకం ఉందంటూనే.. ఎమ్మెల్యేపై తమకు నమ్మకం లేదని పోస్టర్లు వేయడం.. ఇక్కడి అసమ్మతికి అద్దం పడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..