ఎన్నికల నిర్వహణపై కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా వ్యాఖ్యలు

వ‌చ్చే ఎన్నికల్లో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో వచ్చే పెయిడ్‌ న్యూస్‌లను పర్యవేక్షించేందుకు జిల్లాలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించామని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రింట్‌ మీడియాలో ప్రచురితమయ్యే వార్తలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచారం చేసే పెయిడ్‌ న్యూస్‌ను గుర్తించి ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం అభ్యర్థుల వ్యయంలో చూపిస్తామన్నారు. కంట్రోల్‌ రూమ్‌లో వీటి పరిశీలనకు ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణపై […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:19 pm, Sat, 23 March 19
ఎన్నికల నిర్వహణపై కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా వ్యాఖ్యలు

వ‌చ్చే ఎన్నికల్లో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో వచ్చే పెయిడ్‌ న్యూస్‌లను పర్యవేక్షించేందుకు జిల్లాలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించామని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రింట్‌ మీడియాలో ప్రచురితమయ్యే వార్తలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచారం చేసే పెయిడ్‌ న్యూస్‌ను గుర్తించి ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం అభ్యర్థుల వ్యయంలో చూపిస్తామన్నారు. కంట్రోల్‌ రూమ్‌లో వీటి పరిశీలనకు ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేశామన్నారు.

ఎన్నికల నిర్వహణపై జిల్లా స్థాయి సమాచారాన్ని తెలియజేస్తూ ప్రత్యేక డ్యాష్‍బోర్డ్ రూపొందించామన్నారు. దీని ద్వారా ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు పొందే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా సమీక్షిస్తామన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా 16,627 పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగించామన్నారు. రూ.3.27కోట్ల నగదు, 56వేల లీటర్ల లిక్కర్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. 1950 హెల్ప్‌లైన్‌ ద్వారా 15,735 ఫోన్‌ కాల్స్‌కు సమాధానం ఇచ్చామ‌న్నారు. సీ విజిల్ ఆప్ ద్వారా 128 ఫిర్యాదులు అందాయన్నారు.