Andhra Pradesh: మరో టర్న్ తీసుకున్న వివేకా హత్య కేసు.. టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం..

|

Feb 24, 2023 | 7:47 PM

వివేకా హత్య కేసులో ఓవైపు సీబీఐ విచారణ జరుగుతోంది. దానికి సమాంతరంగా పొలిటికల్ ఇంటరాగేషన్‌ కూడా నడుస్తోంది! రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది!

Andhra Pradesh: మరో టర్న్ తీసుకున్న వివేకా హత్య కేసు.. టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం..
Ycp Vs Tdp
Follow us on

వివేకా హత్య కేసులో ఓవైపు సీబీఐ విచారణ జరుగుతోంది. దానికి సమాంతరంగా పొలిటికల్ ఇంటరాగేషన్‌ కూడా నడుస్తోంది! రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది! దాని చుట్టూ రాజకీయ రచ్చ రాజుకుంటోంది! లేటెస్ట్‌గా సునీల్‌యాదవ్‌ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సీబీఐ వేసిన కౌంటర్‌, టీడీపీ-వైసీపీ మధ్య మరోసారి మంటల్ని రాజేసింది. ఎవరి వర్షన్‌ను వాళ్లు చాలా బలంగా వినిపిస్తున్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి దాదాపు 4 ఏళ్లు కావస్తోంది. అప్పటి నుంచి ఈ కేసులో ఎన్నో మలుపులు. విషయం ఎప్పుడో పొలిటికల్ టర్న్ తీసుకుంది కూడా. దర్యాప్తు విషయంలో ఈ మధ్యే సీబీఐ దూకుడు పెంచింది. రోజుకో విషయం బయటకు వస్తోంది. ఇప్పుడు ఈ కేసులో నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్‌ కూడా బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి కౌంటర్‌ పిటిషన్ వేసింది సీబీఐ. ఈ పిటిషన్‌లోని అంశాలే ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వివేకాను ఎవరు చంపారో సీబీఐ తేల్చేసింది అంటోంది తెలుగుదేశం. ఈ లీకుల వెనుక కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ అంతా చంద్రబాబుదే అని ఆరోపిస్తోంది వైసీపీ.

వివేకా హత్య చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ అంశాన్ని తెరపైకి తెస్తోంది తెలుగుదేశం. నేరుగా సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ విమర్శలను పూర్తిగా ఖండిస్తోన్న వైసీపీ సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తోంది. ఎన్నికల ముందు జగన్‌ క్యారెక్టర్‌ను బ్యాడ్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు అండ్ టీమ్‌ కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది. సీబీఐ కూడా చంద్రబాబు లైన్‌లోనే పనిచేస్తోందని సంచలన విమర్శలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

గూగుల్ టేకౌట్‌! ఈ పదం కూడా పొలిటికల్ రచ్చకు ముడిసరుకుగా మారిపోయింది. ఈ హత్య కేసు గుట్టుని టెక్నాలజీ విప్పేసిందన్నది టీడీపీ వర్షన్. టెలికాం ఆపరేటర్‌ కూడా ఆ పని చేస్తాడని, దానికి సీబీఐ ఎందుకని నిలదీస్తోంది వైసీపీ.

వివేక హత్య కేసు కచ్చితంగా రాజకీయ ముడిసరుకుగా మారింది.! అందుకే పొలిటికల్ ఇంటరాగేషన్‌ నడుస్తోంది. జగన్‌ను టార్గెట్ చేస్తోంది టీడీపీ. దర్యాప్తు ఏకపక్షంగా, టీడీపీకి కావాల్సిన లైన్‌లో జరుగుతోందనే అంశాన్ని బలంగా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. వివేకా చుట్టూ నడుస్తున్న ఈ పొలిటికల్ యుద్ధం..భవిష్యత్‌లో మరింత రచ్చ రాజేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..