Kesineni Brothers: కేశినేని బ్రదర్స్ మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి. తమ్ముడు చిన్నిపై ఎంపీ కేశినేని నాని కేసు పెట్టారు. కారుపై తన ఎంపీ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నారని.. ఇదీ ఇల్లీగల్ ఆయన నెల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 27న ఆయన పటమట పోలీసులకు కంప్లైట్ ఇచ్చారు. ఈ ఫిర్యాదుపై జూన్9న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేశినేని సోదరుడు శివనాథ్ భార్య పేరుతో కారు ఉందని తేలింది. కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని కేశినేని చిన్నికి స్వయంగా సోదరుడు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. సొంత సోదరుడిపైనే నాని ఫిర్యాదు చేయడం, ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం, పోలీసులు విచారణ చేపట్టడం ఇప్పుడు బెజవాడలో హాట్‌టాపిక్‌గా మారింది.
విజయవాడ ఎంపీగా కేశినేని వరుసగా రెండోసారి గెలిచారు. ఎలక్షన్ ప్రచారంలో చిన్ని కీలకంగా వ్యవహరించారు. రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత టీడీపీకి దూరంగా ఉంటున్నారు. పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ వ్యవహారాలపై అసంతృప్తిగా ఉన్న…ఇటీవల మహానాడుకు హాజరుకాలేదు. కార్పొరేషన్ ఎన్నికల టైమ్‌లో సడెన్‌గా కూతురిని టీడీపీ మేయర్ క్యాండేట్‌గా ప్రకటించారు. దీనిపై అప్పట్లో పార్టీలో పెద్ద వివాదమే నడిచింది. పదో వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన నాని కూతురు ఇప్పుడు పార్టీలో యాక్టివ్‌గా లేరు.
టీడీపీలో నాని అంటీముట్టనట్లు వ్యవహరించడంతో బ్రదర్ చిన్ని యాక్టివ్ అయ్యారు. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ టికెట్ కూడా చిన్న ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. నానికి అల్టర్నేటివ్ గా చిన్ని ఎదగాలనుకుంటున్నారని పార్టీలో డిస్కషన్ నడుస్తోంది. ఈ బ్యాక్‌గ్రౌండ్ నేపథ్యంలోనే సోదరుల మధ్య విభేదాలు పీక్‌కి చేరాయి.
ఈ క్రమంలోనే ఇల్లీగల్‌గా తన ఎంపీ స్టిక్కర్ వాడుకుంటున్నారని చిన్నిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు నాని.. ఎంపీ, వీఐపీ స్టిక్కర్‌తో చలామణి అవుతున్నారన్నారు. తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నాని ఫిర్యాదుతో పోలీసులు FIR నమోదు చేశారు. ఇప్పుడు విచారణ చేపట్టారు. అయితే తన అన్నతో తనకు శత్రుత్వం లేదని చెప్పారు కేశినేని చిన్ని.
తన అన్నతో విభేదాలపై క్లారిటీ
చిల్లర వివాదంలోకి తన అన్న నా భార్యను లాగడం బాధాకరమని అన్నారు. ఆ స్టిక్కర్ ఎవరిదో ఏంటో పోలీసుల విచారణలో తేలుతుందని చిన్నా చెప్పారు. హైదరాబాదులో పోలీసులు తన కారుని ఆపారు.. పోలీస్ కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లారు.. ఎంక్వైరీ చేశారని పేర్కున్నారు. ప్రస్తుతం నా కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదు.. నేను ఓ చిన్న కార్యకర్తను.. చంద్రబాబు సీఎం కావడమే మా లక్ష్యమని తెలిపారు. ఆటోనగర్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం జరిపితే కూడా వివాదం చేశారు. నాని నా శత్రువు కాదు.. మా సొంత అన్న అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిన్న. తాను ఎప్పుడూ ఎంపీగా పోటీ చేస్తానని టిక్కెట్ అడగలేదని.. చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి తాను సిద్దమని చెప్పారు. హైదరాబాద్ పోలీసులు తన కారు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని పేర్కొన్నారు. నాపై ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహరమే కానీ.. రాజకీయపరమైన కారణం కాదని స్పష్టం చేశారు చిన్న. తనపై రాజకీయంగా విమర్శ చేయొచ్చు.. కానీ ఇంట్లో ఆడవాళ్లను బయటకు లాగడం సరికాదని సూచించారు.. అంతేకాదు పార్టీ ఆదేశిస్తే.. కేశినేని నాని గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు చిన్న.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..