విశాఖలో గంజాయి కలకలం..పోలీసులకు చిక్కిన రష్యన్ దేశస్థుడు

విశాఖపట్నంలో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న వ్లాదిమిర్ ఒబ్రియాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

విశాఖలో గంజాయి కలకలం..పోలీసులకు చిక్కిన రష్యన్ దేశస్థుడు
Arrest
Follow us

|

Updated on: Mar 22, 2023 | 6:52 AM

విశాఖపట్నంలో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న వ్లాదిమిర్ ఒబ్రియాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను రష్యా దేశానికి చెందినవాడని గుర్తించారు. వ్లాదిమీర్ ను పోలీసులు విచారించగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతనికి విశాఖలో మరికొంతమంది గంజాయి ఇస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అతను ఇచ్చిన సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి శివ, జగదీష్, అనిల్ అనే మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కూడా విచారించగా మరికొన్ని విషయాలు బయటపడ్డాయి. గంజాయిని రామకృష్ణ అనే వ్యక్తి ద్వారా రష్యన్ కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. అయితే వ్లాదిమిర్ ఒబ్రియన్ గోవా నుంచి విశాఖపట్నానికి వచ్చినట్లు గుర్తించామని వెల్లడించారు. దీనిపై మరింత విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..