Andhra Pradesh: పోలీసు జాగిలంకు ఘన సన్మానం.. టీనా సేవలు మరచిపోలేనివి అంటూ ప్రశంసలు

| Edited By: Surya Kala

Jun 26, 2024 | 12:25 PM

హత్య, దొంగతనం, పేలుడు పదార్థాల గుర్తింపు, నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను కనిపెట్టడం, డ్రగ్స్ లాంటి నేరాలను ఛేదించడానికి పోలీసుల దగ్గర ఉండే ఆయుధమే ఈ జాగిలం. అంతేకాదు పోలీసులకు తన సేవలతో ఎంతగానో అండగా ఉంటుంది. ఈ మేరకు ఆ జాగిలానికి ఎంతో శిక్షణ కూడా ఇస్తారు. తన సేవలను ప్రాణాలకు తెగించి మరీ పోలీసు సిబ్బందికి అందిస్తుంది. అటువంటి జాగిలం పదవి విరమణ చేయడంతో పోలీసు అధికారులు ఘనంగా సన్మానం చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లలో చోటు చేసుకుంది.

Andhra Pradesh: పోలీసు జాగిలంకు ఘన సన్మానం.. టీనా సేవలు మరచిపోలేనివి అంటూ ప్రశంసలు
Police Dog
Follow us on

నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి అధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. పోలీసుల జాగిలం టీనా రిటైర్మెంట్ సందర్భంగా సన్మానించి విడ్కోలు చెప్పారు జిల్లా పోలీసుల యంత్రాంగం. జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వహిస్తూన్న ల్యాబ్రెడార్ రెత్రివర్ (Labrador Retriever) జాతికి చెందిన పోలీసు జాగిలం (TEENA) “టీన” ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల పాటు విధులు నిర్వచించింది.ఈ పోలీసు జాగిలం ప్రతి VIP,VVIP ల బందోబస్తు విధులలో ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉన్నాయని అనుమానం కలిగితే వాటిని కనుక్కోవడం “టీన” స్పెషాలిటీ అని ఎస్పీ కొనియాడారు.

అంతే కాకుండా జిల్లాలోని శ్రీశైలంలో జరిగే మహా శివరాత్రి, ఉగాది బ్రహ్మోత్సవాలతో పాటు తిరుపతి నందు జరిగిన బ్రహ్మోత్సవాలలో కూడా టీనా సేవలు అందించింది. అలాగే అసెంబ్లీ బందోబస్తు, చీఫ్ మినిస్టర్, ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా టీనా సమర్థవంతంగా సేవలు అందించిందని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి కొనియాడారు.

ఇవి కూడా చదవండి

టీనాతో పాటు టీనా హ్యాండ్లర్ AR పోలీసు కానిస్టేబుల్ Y. సుంకిరెడ్డి కూడా శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ K.ప్రవీణ్ కుమార్, AR డి.ఎస్.పి శ్రీనివాసులు , ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..