AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఆ వైసీపీ నేత భవిష్యత్తు ఏంటి.. అరెస్ట్ తప్పదా..

వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. కోర్టు ఆదేశాలతో ఇవాళ పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకునే ఛాన్స్‌ ఉంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు పోలీసులు. ఇవాళ ఏక్షణంలోనైనా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనేక కేసులున్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం కేసుతో పాటు మూడు హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి.

AP News: ఆ వైసీపీ నేత భవిష్యత్తు ఏంటి.. అరెస్ట్ తప్పదా..
YSRCP
Srikar T
|

Updated on: Jun 06, 2024 | 8:06 AM

Share

వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. కోర్టు ఆదేశాలతో ఇవాళ పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకునే ఛాన్స్‌ ఉంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు పోలీసులు. ఇవాళ ఏక్షణంలోనైనా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనేక కేసులున్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం కేసుతో పాటు మూడు హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. పిన్నెల్లి నరసరావుపేటలోని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ నివాసంలో ఉండటంతో ఆ ఇంటి బయట పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. మరికొంత మంది పోలీసులు మఫ్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి తప్పించుకోకుండా గట్టి చర్యలు చేపట్టారు. ఇంటి నుంచి బయటకు కదలనివ్వకుండా నిఘా పెట్టారు.

మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. గురువారం వరకూ ఆయన్ని అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం పిన్నెల్లిని కౌంటింగ్ కేంద్రానికి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆయన నివాసం ఉన్న ప్రాంతంలో పోలీసులు పెద్దయెత్తున మోహరించారు. అంతేకాదు పల్నాడు ప్రాంతమంతా హై అలర్ట్‌ను ప్రకటించారు. వ్యాపార దుకాణాలను మూసివేయించారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇవాళ ఏక్షణమైనా అరెస్టు చేయవచ్చని పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలోకి రావడం కూడా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఇబ్బందికరంగా మారింది. అరెస్టు తప్ప.. వేరే ఆప్షన్‌ కూడా లేని పరిస్థితి. ఈ క్రమంలో పిన్నెల్లి ఫ్యూచర్‌ ఏంటనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై