
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ వారాహి యాత్రను అడ్డుకోవడానికే ఆంక్షలు విధించామని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు అమలాపురం ఎస్పీ.సెక్షన్ 30 యాక్ట్ సాధారణ విధుల్లో భాగమేనని క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేకించి జనసేన సభల కోసం పెట్టింది కాదని స్పష్టం చేశారు. ఆ తర్వాత.. పవన్ కల్యాణ్ సభ జరిగే ప్రాంతాన్ని..జనసేన నేతలతో కలిసి పరిశీలించారు అమలాపురం డిఎస్పీ.. వారాహియాత్ర రూట్‌మ్యాప్‌ను కూడా పరిశీలించారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా అమలాపురంలో పోలీసులు ఆంక్షలు పెట్టారన్న వివాదం సద్దు మణిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం నుంచి నెలాఖరు వరకు సెక్షన్ 30 యాక్ట్ అమలులోకి వచ్చింది. దీంతో వారాహి యాత్రను అడ్డుకునేందుకే పోలీసులు ఆంక్షలు పెట్టారని జనసేన కార్యకర్తలు ఆందోళన చెందారు. ఇదే విషయం టీవీ9లో ప్రసారమైంది. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. వారాహి యాత్ర కోసం ఆంక్షలు పెట్టలేదని.. అవన్నీ సాధారణ విధుల్లో భాగమేనని అమలాపురం ఎస్పీ చెప్పారు. అంతేకాకుండా.. జనసేన నేతలతో కలిసి పవన్ కల్యాణ్ సభ జరిగే ప్రాంతాలను పర్యవేక్షించారు అమలాపురం డిఎస్పీ.. ఆ తర్వాత వారాహి యాత్ర రూట్ మ్యాప్‌ను కూడా పరిశీలించారు. పోలీసులే స్థానిక జనసేన నేతలతో మాట్లాడటంతో.. ఆంక్షల వివాదం సద్దుమణిగింది.
మరోవైపు, పవన్ కల్యాణ్ సినిమా షూటింగులు పక్కనపెట్టారు. వరుస పర్యటనలు ప్లాన్ చేశారు. స్పీడ్ పెంచారు. అందులో భాగంగా.. వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 14న అన్నవరం దేవస్థానం నుంచి మొదలై.. భీమవరం వరకు తొలి విడత వారాహి యాత్ర సాగనుంది. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో యాత్రకు జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు..ఈ నెల 21న అమలాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో జనసేన నేతలు పోస్టర్లు కూడా ఆవిష్కరించారు. ముందుగా మంగళగిరిలో పార్టీ ఆఫీసులో కార్యకర్తలతో యాత్రకు సంబంధించి సమావేశం నిర్వహించారు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..