విజయవాడలో అవమానవీయ ఘటన.. ఆ కోరికలు తీరుస్తేనే టీసీ ఇస్తానంటు విద్యార్థినులకు బెదిరించిన ప్రిన్సిపాల్

|

Jun 07, 2023 | 7:03 AM

విజయవాడలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సింగ్ ప్రిన్సిపాల్ రవీంద్ర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నట్లు నిర్ధారణ కావటంతో లైంగిక వేధింపుల కేసు 354a కింద నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడ్ని 2 వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్ట్ లో హాజరుపరిచారు.

విజయవాడలో అవమానవీయ ఘటన.. ఆ కోరికలు తీరుస్తేనే టీసీ ఇస్తానంటు విద్యార్థినులకు బెదిరించిన ప్రిన్సిపాల్
Harassment
Follow us on

విజయవాడలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సింగ్ ప్రిన్సిపాల్ రవీంద్ర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నట్లు నిర్ధారణ కావటంతో లైంగిక వేధింపుల కేసు 354a కింద నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడ్ని 2 వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్ట్ లో హాజరుపరిచారు. అయితే పోలీసులు రిమాండ్ అడగగా కోర్టు నిరాకరించింది. వివరాల్లోకి వెళ్తే అంబాపురంలో నవోదయ పారా మెడికల్ కళాశాల విద్యార్థులపై ప్రిన్సిపాల్ రవీంద్రరెడ్డి కోరికలు తీర్చాలంటూ బెదిరింపులకు గురిచేశాడు. విద్యాభ్యాసం ముగియడంతో టీసీలు తీసుకోవడానికి వచ్చిన విద్యార్థులను వేధించాడు. రాత్రి సమయాల్లో వాట్సాప్లో అసభ్య మెస్సేజ్‌లు పెట్టేవాడని విద్యార్థులు ఆరోపించారు. తన కోరికలను తీరిస్తేనే టీసీలు ఇస్తానని బెదిరించాడు వాపోయారు.

ప్రిన్సిపాల్ లైంగికంగా వేధిస్తున్నాడని  మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి దినాకుమారి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ లైంగిక ఆరోపణలతో చాలామంది విద్యార్థులు హాస్టల్ కూడా ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో చైల్డ్ లైన్ అధికారులు విచారణ చేపట్టారు. నిన్న నవోదయా పారామెడికల్ హాస్టల్‎లో విచారణ చేసి స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకుని వెళ్లారు. అలాగే హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విద్యార్థినులను కూడా విచారించనున్నారు. ఈ వ్యవహారంపై పైఅధికారులకు రిపోర్ట్ ఇవ్వనున్నారు. రిపోర్ట్ ఆధారంగా కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..