Alluri District: అల్లూరి జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్‌.. 725 కిలోల గంజాయి స్వాధీనం..

|

Dec 27, 2023 | 9:56 PM

అల్లూరి జిల్లా సీలేరులో అంత రాష్ట్ర గంజాయి ముఖాన్ని పట్టుకున్నారు పోలీసులు. కోటిన్నర విలువైన 725 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని.. కారును సీజ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కోసం గాలిస్తున్నారు. ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు.

Alluri District: అల్లూరి జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్‌.. 725 కిలోల గంజాయి స్వాధీనం..
VSP Ganjai Seize
Follow us on

అల్లూరి జిల్లా సీలేరులో అంత రాష్ట్ర గంజాయి ముఖాన్ని పట్టుకున్నారు పోలీసులు. కోటిన్నర విలువైన 725 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని.. కారును సీజ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కోసం గాలిస్తున్నారు. ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన సోనాకిషన్, లక్ష్మణ్ కాలే అనె వాళ్ళు ఒరిస్సాలో పశువులంక ప్రాంతంలో మరి కొంతమందితో గంజాయి కోసం డీల్ కుదుర్చుకున్నారు. మహారాష్ట్రకు చెందిన వ్యాపారులతో మాట్లాడి ఆ గంజాయి లోడ్ తీసుకొని సీలేరు మీదుగా తరలించెందుకు ప్లాన్ చేశారు. అనుమానం వచ్చిన సీలేరు పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. టి ఆర్ సి పాఠశాల వాహనాన్ని ఆపి తనిఖీ చేసేసరికి అందులో గంజాయి గుట్టు బయటపడింది. కోటిన్నర విలువ చేసి 725 కిలోల గంజాయిని కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఏఓబీలో పండే గంజాయిని.. సీలేరు నది మీదుగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అల్లూరి జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. గంజాయిని స్వాధనం చేసుకున్న పోలీసులు.. మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. ఒరిస్సా పశువులంక గ్రామానికి చెందిన మరి కొంతమంది పాత్ర ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. పరారీలో ఉన్న మరికొంతమని మహారాష్ట్ర పోలీసుల సహకారంతో పట్టుకుంటామని అంటున్నారు చింతపల్లి ఏ ఎస్ పీ ప్రతాప్ కిషోర్. ఇదిలా ఉంటే ఏపీలో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అక్రమ గంజాయి ఆగడాలు ఆగడం లేదు. రోజుకో చోట ఏదో ఒక రకంగా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడుతూనే ఉన్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..