విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఇద్దరు నిందితులు బొలెరో వాహనంలోని క్యాబేజీ లోడుతో వాటి బుట్టల కింద గంజాయి పెట్టి తరలించే ప్రయత్నం చేశారు. పెందుర్తి వద్దకు రాగానే వారి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా గుట్టు బయటపడింది. నిందితులు సుమారు 14 బ్యాగుల్లో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒరిస్సా నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. బొలెరో వాహనాన్ని సీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.
మరోవైపు గంజాయిని అక్రమగా తరలించడం రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఈ గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఏపీ పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. దీంతో పోలీసులకు చిక్కకుండా తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు స్మగ్లర్లు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. అయితే పోలీసులు కూడా పక్కా వ్యూహాలతో వారి ఎత్తులను చిత్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..