AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కార్లో వస్తారు..రెక్కీ నిర్వహిస్తారు..ఆ తర్వాత ఇళ్లలోకి రాకుండానే…

ఈ దొంగల రూటే సపరేటు. రాత్రి వేళ దర్జాగా కారులో వస్తారు.. హైవే పక్కన, రోడ్ల పక్కన ఎక్కడ లారీలు నిలిపి ఉంటే అక్కడ వాలిపోతారు. చక్కగా పని ముగించుకుని వెళతారు.. తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన ఈ జాదూ గాళ్లను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

Andhra:  కార్లో వస్తారు..రెక్కీ నిర్వహిస్తారు..ఆ తర్వాత ఇళ్లలోకి రాకుండానే...
Diesel Thieves With Police
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Apr 17, 2025 | 1:19 PM

Share

కారులో వస్తారు.. వీధుల్లో తిరుగుతారు.. రహదారి పక్కన, పార్కింగ్‌ స్థలాల్లో నిలిపిన లారీల్లోని డీజిల్‌ను దొంగిలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఆదోని పోలీసులు పక్కా ప్లాన్‌తో ఆ దొంగల ముఠా ఆటకట్టించారు. ముఠా సభ్యులు ఇప్పటి వరకు కర్నూలు, తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో 10వేల లీటర్లకుపైగా డీజిల్‌ చోరీ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన 14 మంది కలిసి ముఠాగా ఏర్పడి ఈ చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రి వేళ కారులో తిరుగుతూ ఎక్కడ లారీలు నిలిపి ఉంటాయో రెక్కీ నిర్వహిస్తారు. కొందరు కాపలా ఉంటే.. మరికొందరు లారీ వద్దకు వెళ్తారు. డీజిల్‌ ట్యాంకుల తాళాలు పగలగొట్టి అందులో పైపులు వేసి తమ వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్‌ క్యాన్లలో నింపుకొంటారు. వెంటనే అక్కడి నుంచి జారుకుంటారు. చోరీ చేసిన ఇంధనాన్ని విడిగా విక్రయించే చిరు వ్యాపారులకు ఇచ్చి సొమ్ము చేసుకొంటున్నారు.

ఆదోని డీఎస్పీ హేమలత తెలిపిన వివరాలు ప్రకారం.. ఆదోని వన్ టౌన్ పరిధిలోని ఓ పార్కింగ్‌ స్థలంలో మార్చి 23 , ఏప్రిల్ 08 తేల్లో పార్క్‌ చేసిన ఉన్న లారీల్లో సుమారు 5 వేల లీటర్ల మేర డీజిల్ చోరీ జరిగింది. బాధితులు ఏప్రిల్‌ 8వ తేదీన వన్ టౌన్ పీఎస్‌ లో ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డీఎస్పీ హేమలత.. ఒకటో పట్టణ సీఐ, సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం లోని నారాయణ పేటలో నిందితులను గుర్తించి 11 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా దాదాపు 10 వేల 600 లీటర్ల డీజిల్ దొంగిలించినట్టు తేలింది. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వారికోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ10 లక్షల , 30 వేల నగదు , నాలుగు కార్లు , 350 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్ చేయండి. 

Follow Us
కుజ శుభ సంచారం: మరో వారంలో ఈ రాశుల వారికి అదృష్టం, డబ్బు..
కుజ శుభ సంచారం: మరో వారంలో ఈ రాశుల వారికి అదృష్టం, డబ్బు..
గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు
గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు
6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్.
6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్.
ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!
ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?