Andhra Pradesh: కావ్య హత్య కేసులో ముమ్మర దర్యాప్తు.. గన్ ఎలా వచ్చిందనే విషయంపై అనుమానాలు
నెల్లూరు(Nellore) జిల్లాలో జరిగిన కావ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రేమించలేదన్న కారణంతో కావ్యను సురేశ్ తుపాకీ తో కాల్చి, తనకు తాను కాల్చుకుని చనిపోయాడు. మృతదేహాలను....
నెల్లూరు(Nellore) జిల్లాలో జరిగిన కావ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రేమించలేదన్న కారణంతో కావ్యను సురేశ్ తుపాకీ తో కాల్చి, తనకు తాను కాల్చుకుని చనిపోయాడు. మృతదేహాలను నెల్లూరు జీజీహెచ్(Nellore GGH) కు తరలించారు. ఉదయం 10 గంటలకు కావ్య, సురేశ్ మృతదేహలకు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగికి పిస్టోల్ ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సురేశ్ ఫోన్ కాల్స్, మెసేజ్ ల ఆధారంగా విచారణ సాగిస్తున్నారు. సురేశ్ రెడ్డి వద్ద ఎప్పటి నుంచి పిస్టోల్ ఉంది, రెండు మ్యాగజైన్స్ బుల్లెట్లు ఎక్కడివి అనేవి ప్రస్తుతం అనుమానం రేకెత్తిస్తున్నాయి. సురేశ్ రెడ్డి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడంతో అక్కడి నుంచి పిస్టోల్ తీసుకువచ్చాడనే కోణంలో విచారణ చేస్తున్నారు. పిస్టోల్ పై మేడ్ ఇన్ యూఎస్ఏ అనే అక్షరాలతో పాటు, స్టార్ గుర్తును పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారమే కావ్యను హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. కావ్య, సురేశ్ మృతదేహలకు ఈ రోజు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదన్న అక్కసుతో ప్రేమించిన యువతిని ఓ యువకుడు తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ కాల్చుకుని చనిపోయాడు. కావ్య, సురేశ్.. వీళ్లిద్దరిదీ నెల్లూరు జిల్లాలోని తాటిపర్తి గ్రామం. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. సురేశ్ బెంగళూరులో, కావ్య పుణెలో పని చేస్తున్నారు. అంతకుముందు ఇద్దరూ బెంగళూరులో కలిసి ఉద్యోగం చేశారు. ఆరునెలలుగా వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచీ కావ్యను పెళ్లి చేసుకుంటానని వెంటపడుతూ వచ్చాడు సురేశ్. కానీ, కావ్యను సురేశ్ కు ఇచ్చేందుకు ఆమె పెద్దలు ఒప్పుకోలేదు. ఇవాళ కూడా పెళ్లి గురించి అడగడానికే వచ్చిన సురేశ్.. చేతిలోకి గన్ తీసుకుని ఒక్కసారిగా కావ్యపై తుపాకీతో దాడి చేసి చంపేశాడు. అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Alliance Politics In AP: పొత్తులపై బీజేపీ, జనసేన అలా.. చంద్రబాబు ఇలా.. మరి వైసీపీ సంగతి ఏంటి..?
Ram Charan: సముద్రతీరాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సెల్ఫీల కోసం పోటీ పడ్డ ఫ్యాన్స్