AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం.. వాష్ రూంలో బంగారం గుర్తింపు

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ హుండీల లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. నిన్న మహామండపం ఆరో అంతస్థులో అమ్మవారి హుండీల్లోని కానుకల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో...

Vijayawada: హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం.. వాష్ రూంలో బంగారం గుర్తింపు
Indrakeeladri
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 10, 2022 | 9:39 AM

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ హుండీల లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. నిన్న మహామండపం ఆరో అంతస్థులో అమ్మవారి హుండీల్లోని కానుకల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో బంగారు ఆభరణాలను అపహరించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఎస్పీఎఫ్ తనిఖీల్లో నల్లపూసల చైన్, ఒక ఉంగరం, రెండు గిల్టు ఉంగరాలు, బుట్ట దుద్దులు బయటపడ్డాయి. మహామండపం వద్ద ఉన్న వాష్ రూమ్ లో బంగారాన్ని పోలీసులు గుర్తించారు. అపహరించేందుకు యత్నించిన బంగారం విలువ సుమారు 5 గ్రాములు ఉంటుందని అధికారులు తేల్చారు. వీటి విలువ రూ.16 వేలు ఉంటుందని అంచనా వేశారు. ఎస్పీఎఫ్ పోలీసులు ఆకస్మిక తనిఖీల్లో గుర్తించిన బంగారాన్ని ఎవరు దొంగిలించారనే విషయంపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు.

దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం హుండీలను సిబ్బంది సోమవారం లెక్కించారు. 41 హుండీల్లో 19 రోజుల్లో వచ్చిన కానుకలను లెక్కించగా రూ.2.64 కోట్ల ఆదాయం వచ్చింది. పది గంటల పాటు దేవస్థానం సిబ్బందితోపాటు సేవా సంస్థల సభ్యులు కానుకలను లెక్కించారు. 586 గ్రాముల బంగారం, 6.060కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు.

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

Cold Water Side Effects: ఎండాకాలంలో అదేపనిగా చల్లని నీరు తాగుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

LIC IPO: ఎల్ఐసీ ఐపీవోకు భారీ స్పందన.. అప్లై చేసిన వారందరికీ షేర్లు వస్తాయా.. పూర్తి వివరాలు..