AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Speech: అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి యాత్ర సాగుతోంది.. తెలుగు ప్రజలపై ప్రశంసలు కురిపిస్తూ.. ఆసక్తికరంగా ప్రధాని మోదీ ప్రసంగం..

దేశంలోని మారుమూల ప్రాంతాల అభివృద్దికి కేంద్రంలోని తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధనామంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా అభివృద్ధి యాత్ర సాగుతోందన్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా విశాఖపట్ణంలో పర్యటించిన ఆయన రాష్ట్రంలో అనేక అభివృద్ధి..

PM Modi Speech: అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి యాత్ర సాగుతోంది.. తెలుగు ప్రజలపై ప్రశంసలు కురిపిస్తూ.. ఆసక్తికరంగా ప్రధాని మోదీ ప్రసంగం..
PM MODI
Amarnadh Daneti
|

Updated on: Nov 12, 2022 | 11:36 AM

Share

దేశంలోని మారుమూల ప్రాంతాల అభివృద్దికి కేంద్రంలోని తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధనామంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా అభివృద్ధి యాత్ర సాగుతోందన్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా విశాఖపట్ణంలో పర్యటించిన ఆయన రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మాట్లాడారు. దేశంలో వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని తీసుకుని.. అభివృద్ధి వేగాన్ని పెంచామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించే ఆప్యాయత ఎనలేనిదని ప్రశంసించారు. అన్ని రంగాల్లోనూ తెలుగు ప్రజలు తమ సత్తా చాటుతున్నారని తెలిపారు. కొన్ని నెలలక్రితం తాను విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలకోసం రాష్ట్రానికి వచ్చానని, మరోసారి అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో విశాఖపట్టణానికి ఎంతో ప్రత్యేకత ఉందని, ఇదొ ప్రత్యే్క నగరమని పేర్కొన్నారు.

వాణిజ్య నగరంగా విశాఖపట్టణానికి పేరుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒకప్పుడు విశాఖ ఓడరేవునుంచి పశ్చిమాసియా, తూర్పు ఆసియాలకు ఓడల ద్వారా వ్యాపారం జరిగిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈరోజు శంకుస్థాన, ప్రారంభోత్సవాలు చేసిన పథకాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషింస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విద్యార్జన ద్వారా మాత్రమే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేదని, స్నేహ, సేవా స్వభావాలు ఆ గుర్తింపునకు కారణమన్నారు. సమ్మిళితాభివృద్ధి కోసం దేశ వ్యాప్తంగా ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రధాని తెలిపారు. రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు అత్యాధునిక వసతులతో కల్పిస్తున్నామని చెప్పారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో ఉందన్నారు. ఇంధనం మొదలు ఆహారం వరకూ కొరత ఎదుర్కొంటున్నాయి. కాని ఈ సమయంలో కూడా భారత్ ఎన్నో అడ్డుగోడలు బద్దలు కొట్టి అభివృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు.

దేశం ప్రపంచ గమనానికి కేంద్రం అవుతోందని తెలిపారు ప్రధాని మోదీ. ఎంతో మంది భారత దేశ విధానాలను ప్రశంసిస్తున్నారని చెప్పారు. రెండున్నరేళ్లుగా దేశ వ్యాప్తంగా పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. రైతులకు ఏడాదికి రూ.6వేల చొప్పున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తున్నామని ప్రధాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి.. హిందీలో కొనసాగించారు. ప్రధాని ప్రసంగాన్ని ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ పివిఎన్.మాధవ్ తెలుగులోకి అనువాదం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..