ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి..

ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు. రాష్ట్ర సర్కార్ తీరుతో అభివృద్ధి లేకుండా పోయిందని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏపీలో ప్రచారం ఊపందుకుంది. కూటమి తరపున ప్రధాని మోదీ రెండు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి..
Modi
Follow us
Ravi Kiran

|

Updated on: May 06, 2024 | 9:15 PM

ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు. రాష్ట్ర సర్కార్ తీరుతో అభివృద్ధి లేకుండా పోయిందని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏపీలో ప్రచారం ఊపందుకుంది. కూటమి తరపున ప్రధాని మోదీ రెండు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదట రాజమండ్రి సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించిందని మోదీ అన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాష్ట్రం కూడా అంతే స్పీడ్‌తో అభివృద్ధి చెందాలని మోదీ తెలిపారు.

కేంద్ర ప్రాజెక్టుల అమలును రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసిందని ప్రధాని ఆరోపించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని.. ఏపీ భవిష్యత్తు కోసం కూటమికి ఓటేయాలని కోరారు.

ఆ తరువాత అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. భారత్ ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిందని అన్నారు. చందమామ దక్షిణ భాగాన జెండా రెపరెపలాడించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. ఏపీ నుంచి అనేకమంది ప్రవాసులు విదేశాల్లో నివసిస్తున్నారని.. భారత్ సాధించిన ఘనతతో వారందరూ ఎంతో గుర్తింపు పొందుతున్నారని మోదీ అన్నారు. ఏపీలో శాండ్, ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయని మోదీ ఆరోపించారు. ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల చెరకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో చెరకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని తెలిపారు.