Pawan Wants to Meet CM Jagan: రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలపై సీఎం జగన్ ను త్వరలోనే కలుస్తా: జనసేనాని

రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి తనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు పవన్. త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తా...

Pawan Wants to Meet CM Jagan: రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలపై సీఎం జగన్ ను త్వరలోనే కలుస్తా: జనసేనాని
Follow us
Surya Kala

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 23, 2021 | 1:53 PM

Pawan Wants to Meet CM Jagan: జనసైనికులు కార్యకర్తలు సంయమనం పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. బాధ్యతగా మెలగాలని.. ఎవరు ఏమిరెచ్చగొట్టినా సోషల్ మీడియాలో ఆవేశపూరితంగా పోస్టులు చేయవద్దని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలపై ముఖ్యమంత్రిని కలవడానికి తనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు పవన్. త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తానన్నారు. విగ్రహాల ధ్వసం విషయంలో సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు పోస్ట్ చేసిన చేయడంపై అక్రమ కేసులు పెట్టి కార్యకర్తలను పోలీసులు వేదిస్తున్నారు. జనసేన కార్యకర్తలు కూడా సంచాలనలకోసం ఏది పడితే సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యదని చెప్పారు.అధికార పార్టీ ట్రాప్ లో జనసేన కార్యకర్తలు పడద్దన్నారు. జనసేన నేతలు కార్యకర్తలకు కష్టం వస్తే అండగా నిలబడాలని సూచించారు. జనసేనాని

మతం కంటే మానవత్వం గొప్పది.. ఒకవ్యకి మరణిస్తే ఆ వ్యక్తిని తిరిగి తీసుకుని రాలేమన్న పవన్ కళ్యాణ్