Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్‌కు విజయ తిలకం దిద్దిన అనా కొణిదెల.. అకిరా నందన్ ఎమోషనల్.. వీడియో

ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఫలితాల్లో సునామీ సృష్టిస్తూ దూసుకెళ్లింది.. ఊహించనన్ని స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ 160కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్లింది..

Pawan Kalyan: పవన్‌కు విజయ తిలకం దిద్దిన అనా కొణిదెల.. అకిరా నందన్ ఎమోషనల్.. వీడియో
Pawan Kalyan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 04, 2024 | 4:22 PM

ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఫలితాల్లో సునామీ సృష్టిస్తూ దూసుకెళ్లింది.. ఊహించనన్ని స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ 160కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్లింది.. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంతోషంవ్యక్తంచేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. పిఠాపురంలో 18 రౌండ్లకు 69,169 ఓట్లు రాగా పోస్టల్ బ్యాలెట్ 1671 ఓట్లతో కలిపి పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 70,354 ఓట్లు వచ్చాయి. దీంతో భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. అంతేకాకుండా.. జనసేన అభ్యర్థులందరూ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

ఈ క్రమంలో భారీ విజయోత్సాహంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరికి బయలుదేరారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్‌కు ఆయన సతీమణి అనా కొణిదెల విజయ తిలకం దిద్ది హారతి ఇచ్చారు. పవన్ తనయుడు అకిరా నందన్ సైతం ఆయన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అకిరానందన్ ఎమోషనల్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో చూడండి..

ఎన్నికల ఫలితాలు లైవ్