Pawan Kalyan: అంత త్యాగం అవసరం లేదు.. ఈ పని చేయండి చాలంటూ వైసీపీ ఎంపీలకు పవన్ చురకలు..

|

Dec 20, 2021 | 12:18 PM

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ గత కొంతకాలంగా నిరసన గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే...

Pawan Kalyan: అంత త్యాగం అవసరం లేదు.. ఈ పని చేయండి చాలంటూ వైసీపీ ఎంపీలకు పవన్ చురకలు..
Pawan Kalyan Steel Plant
Follow us on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ గత కొంతకాలంగా నిరసన గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై జనసేనాని స్పందిస్తూ.. వైసీపీ ప్రభుత్వంపై మళ్ళీ మండిపడ్డారు. ఆంతేకాదు వైసీపీ ఎంపీలు కు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం అంటూ కేంద్రానికి తమ నిరసన తెలిసేలా కనీసం ప్లకార్డులు కూడా పట్టుకోవోడం లేదంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

విశాఖ ఉక్కు పరిరక్షణకై ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ డిజిటల్ క్యాంపెయిన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా ఏపీ వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు , నేతలు ప్లకార్డులు పట్టుకుని ఈ క్యాంపెయిన్ లో భాగంగా తమ నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఒక్క ఎంపీ కూడా ఉక్కు పరిశ్రమ కోసం ప్లకార్డు పట్టుకొని నేపథ్యంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా వైసిపీ ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ఎంపీలు ఉక్కు పరిశ్రమ కోసం కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు. అంటూనే వైసీపీ నేతలు విశాఖ కార్పోరేషన్ ఎన్నికల స‌మ‌యంలో.. చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని తమ ప్రాణాలను త్యాగం చేసి మరీ అడ్డుకుంటామని అన్నారు.. అయితే మీరు మీ ప్రాణాలు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు.. అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు అంటూ పవన్ వ్యాఖ్యానించారు.

విశాఖలోని ఉక్కు పరిశ్రమని ప్రయివేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన మూడు రోజుల పాటు డిజి టల్ క్యాంపెయిన్ చేస్తున్న సంగతి తెలిసిందే..  #Raise_Placards_ANDHRA_MP #SaveVizagSteelPlant  పేరుతో ఆంధ్రప్రదేశ్ లోని ఎంపీలు విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం ఉద్యమం చేయాలంటూ హ్యాష్ టాగ్స్ తో ట్రెండ్ చేస్తున్నారు.

Also Read:  ఘనంగా మల్లికార్జునుడి స్వామికి ఘనంగా ఆరుద్రోత్సవం.. ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు