YCP Vs TDP: లోకేష్‌కు పత్తికొండ ఎమ్మెల్యే వార్నింగ్.. చేసిన ఆరోపణలు నిరూపించాలని శ్రీదేవి ఛాలెంజ్

|

Apr 11, 2023 | 6:49 AM

వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీంతో డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది. పాదయాత్రలో లోకేష్‌ చేస్తున్న వ్యాఖ్యలకు.. వైసీపీ ఎమ్మెల్యేలు మాస్ వార్నింగ్ ఇస్తున్నారు.   

YCP Vs TDP: లోకేష్‌కు పత్తికొండ ఎమ్మెల్యే వార్నింగ్.. చేసిన ఆరోపణలు నిరూపించాలని శ్రీదేవి ఛాలెంజ్
Mla Sridevi On Lokesh
Follow us on

ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రోజు రోజుకూ పొలిటికల్ డైలాగ్స్ పదునెక్కుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్య పంచ్‌లు పేలుతున్నాయి. దీంతో పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. నారా లోకేష్ యువగళం పాద యాత్రలో చేసే ఆరోపణలకు వైసీపీ నుంచి స్ట్రాంగ్‌ కౌంటర్స్‌ వస్తున్నాయి. మొన్న తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి విరుచుకుపడితే… తాజాగా కంగాటి శ్రీదేవి లోకేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలపై నిప్పులు చెరుగుతున్నారు నారా లోకేష్.. ఇటీవల తాడిపత్రికి చెందిన వైసీపీ కేతిరెడ్డి పెద్దారెడ్డిపైనా ఘాటు ఆరోపణలు చేశారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున కబ్జా చేస్తోన్నారని.. ఇదంతా తెలిసినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లోకేష్ మండిపడ్డారు. దీంతో లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి.. జేసీ బ్రదర్స్ ఇచ్చే స్క్రిప్ట్‌ను చదవడం కాదని, చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ ఛాలెంజ్ చేశారు.

ఇప్పుడు పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి లోకేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాదయాత్రకు వస్తే.. కచ్చితంగా నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే పరిస్థితి వేరేలా ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యేలను ప్రజల ముందు చులకన చేయాలని చూస్తే… ఎమ్మెల్యేలంతా కలిసి ఆయన ఇంటి ముందు కూర్చుంటామని గరం అయ్యారు.

ఇవి కూడా చదవండి

మొత్తంగా ఏపీలో రాజకీయ మాటల మసాలాలు పొలిటికల్‌ పులుసును వండివార్చుతున్నాయి. చూడాలి ఈ మాటల యుద్ధం ఇంకెంత కాకరేపుతుందో.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..