నెల్లూరు జిల్లా, ఆగస్టు 14: ఏపీలోని నెల్లూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో అలాగే, సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ చేశారు. సింగరాయకొండ-కావలి మధ్య అర్ధరాత్రి 1:20 గంటల నుంచి 1:50 మధ్య దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్7, ఎస్8 బోగీల్లోకి ప్రవేశించిన దొంగలు అందినకాడికి దోచుకెళ్లారు. అంతటితో ఆగని దొంగలు.. సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా చోరీ చేశారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఎస్1, ఎస్2 బోగీల్లో దొంగతనం చేశారు.
అర్ధరాత్రి 1.20 నుంచి 1.50 గంటల మధ్య దోపిడీ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రయాణికులు వెల్లడించారు. నిద్రిస్తున్న మహిళల మెడల్లో చైన్లు, బంగారు అభరణాలను దొంగలు అపహరించారు. ప్రయాణికుల అరుపులతో అలర్టయిన గార్డులు.. తెట్టు, కావలి రైల్వే పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేశారు. గుడ్లూరు మండలం వీరేపల్లి దగ్గర ఈ చోరీ ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన బంగారం పెద్ద ఎత్తున ఉంటుందని సమాచారం.
బంగారం చోరీకి సంబంధించి ప్రయాణికులు తమ వివరాలను పోలీసులకు వివరించారు. ఈ మేరకు కావలిలో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కాగా.. గార్డు పిర్యాదు తో అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. స్థానిక పోలీసులకు కూడా సమచారం ఇచ్చారు. చోరీ జరిగిన ప్రాంతం సమీపంలోని గ్రామాలు, తదితర ప్రదేశాలను పోలీసులు గాలిస్తున్నారు.
ప్రయాణికులంతా నిద్రలో ఉండగా దొంగలు ట్రైన్ లలో దోపిడికి తెగబడ్డారు. దోపిడి తీరు చూస్తుంటే.. అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా ఉందని పేర్కొంటున్నారు. కాగా.. అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. రాత్రివేళ ట్రైన్ లలో గార్డులు సెక్యూరిటీగా ఉంటారు. అయినప్పటికీ.. ఈ ట్రైన్ లలో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..