AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papikondalu: ప్రకృతి ఒడిలో పరవశించండి.. పర్యాటకులకు అదిరిపోయే న్యూస్‌.. పాపికొండలు విహారయాత్ర ప్రారంభం..

పాపికొండలు నదీ విహారయాత్ర మళ్ళీ ప్రారంభమైంది. నాలుగు నెలల తర్వాత పర్యాటకులకు అనుమతి ఇవ్వడంతో గండిపోచమ్మ నుండి పేరంటాలపల్లి వరకు బోట్లు నడుస్తున్నాయి. 15 బోట్లకు అనుమతులు లభించాయి. భద్రతకు ప్రాధాన్యతనిస్తూ లైఫ్ జాకెట్లు, తనిఖీలు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రమాద నివారణకు మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. పర్యాటకులు సురక్షితంగా విహారయాత్ర చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Papikondalu: ప్రకృతి ఒడిలో పరవశించండి.. పర్యాటకులకు అదిరిపోయే న్యూస్‌.. పాపికొండలు విహారయాత్ర ప్రారంభం..
Papikondalu
Shaik Madar Saheb
|

Updated on: Oct 27, 2024 | 9:14 AM

Share

దీపావళి సెలవులకు ముందు పాపికొండల విహార యాత్ర మళ్లీ ప్రారంభమైంది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో పాపికొండలు విహారయాత్ర మొదలైంది. దాంతో.. గండిపోచమ్మ బోట్ పాయింట్ నుండి పాపికొండలు పర్యటనకు వెళ్లారు పలువురు టూరిస్టులు. నాలుగు నెలల తర్వాత మళ్ళీ పాపికొండలు విహారయాత్ర స్టార్ట్‌ కావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు కావేరి బోట్‌లో షికార్లు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సందడి మధ్య తొలిరోజు పాపికొండల విహారయాత్ర కొనసాగించారు టూరిస్టులు. పర్యాటకులు తరలిరావడంతో గండిపోచమ్మ పరివాహక ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. తొలి రోజు 41 మందితో కావేరి బోట్ పాపికొండలు విహారయాత్రకు వెళ్లింది.

లైఫ్ జాకెట్లతో పాటు ప్రత్యేక తనిఖీలు తర్వాత బోట్‌కు అనుమతిచ్చారు పర్యాటక శాఖ అధికారులు. నాలుగు నెలల తర్వాత పాపికొండల విహారయాత్ర ప్రారంభమవడంతో ఇకపై పర్యాటకుల తాకిడి పెరగనుంది. ఈ క్రమంలోనే.. పాపికొండలు పర్యటనకు 15 బోట్లకు ఫిట్నెస్, లైసెన్స్‌ ఇచ్చారు పర్యాటక శాఖ అధికారులు. గండిపోచమ్మ ఆలయం నుంచి పేరంటాలపల్లి వరకు విహారయాత్ర కొనసాగుతుంది.

వీడియో చూడండి..

ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు..

పాపికొండల టూర్‌కు అనుమతి ఇవ్వడంతో సబ్ కలెక్టర్ కల్పశ్రీతోపాటు స్థానిక అధికారులు బోట్లను పరిశీలించారు. బోట్ల ఫిట్‌నెస్‌, లైసెన్స్‌ రికార్డులను వెరిఫై చేసి.. బోటులో గోదావరిలో షికారు చేశారు సబ్ కలెక్టర్ కల్పశ్రీ. ఈ సందర్భంగా.. టూర్‌కు వెళ్ళే సమయంలో ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలుపై ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. పాపికొండల టూర్‌కు వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బోట్ల యజమానులకు సూచించారు. ఒకవేళ పర్యాటకుల నుండి ఫిర్యాదులు వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సబ్ కలెక్టర్ కల్పశ్రీ. అటు.. ప్రభుత్వ అనుమతులతో ఇకపై.. పాపికొండల్లో బోట్లు కంటిన్యూగా అందుబాటులో ఉంటాయని.. పర్యాటక ప్రియులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు నిర్వాహకులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!