అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి… కారులో ప్రయాణిస్తుండగా ఏం జరిగిందంటే..

| Edited By: Srikar T

Apr 03, 2024 | 8:47 PM

అమెరికాలో చదువుకోవడం అంటే తెలుగు విద్యార్ధులకు ఒక కలగా ఉంటుంది. అలాంటి కోటి ఆశలు, ఆశయాలతో పొరుగుదేశానికి వెళ్ళి చదువుకుంటూ పార్ట్‌టైం జాబ్ చేసుకునే విద్యార్ధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్ధుల సంఖ్యతో పాటు ప్రమాదాలబారిన పడి చనిపోతున్న విద్యార్దుల సంఖ్య కూడా ఏడాదికేడాది పెరిగిపోతోంది.

అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి... కారులో ప్రయాణిస్తుండగా ఏం జరిగిందంటే..
Telugu Student Dies
Follow us on

అమెరికాలో చదువుకోవడం అంటే తెలుగు విద్యార్ధులకు ఒక కలగా ఉంటుంది. అలాంటి కోటి ఆశలు, ఆశయాలతో పొరుగుదేశానికి వెళ్ళి చదువుకుంటూ పార్ట్‌టైం జాబ్ చేసుకునే విద్యార్ధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్ధుల సంఖ్యతో పాటు ప్రమాదాలబారిన పడి చనిపోతున్న విద్యార్దుల సంఖ్య కూడా ఏడాదికేడాది పెరిగిపోతోంది. అలాంటి విషాద ఘటనే తాజాగా మరోకటి జరిగింది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో మరో తెలుగు విద్యార్ధి మృత్యువాతపడ్డాడు.

బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోదవాడ గ్రామానికి చెందిన ఆచంట రేవంత్ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బోడవాడకు చెందిన ఆచంట రేవంత్ (22) బీటెక్ పూర్తి చేసుకుని ఎంఎస్ అభ్యసించేందుకు గత ఏడాది డిసెంబరు చివరిలో అమెరికా వెళ్లాడు. మాడిసన్ ప్రాంతంలోని డకోట స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. భారత కాల మానం ప్రకారం ఏప్రియల్‌ 2 మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు స్నేహితులతో కలసి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు కారులో బయలుదేరాడు. మార్గమధ్యంలో వాతావరణంలో పెనుమార్పులతో ఒక్కసారిగా పొగ మంచు కమ్ముకుంది. రోడ్డు కనిపించకపోవడంతో పాటు రోడ్డుపక్కనే మంచు పేరుకుపోవడంతో కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులతో పాటు రేవంత్‎కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో రేవంత్ దుర్మరణం పాలయినట్టు తమకు సమాచారం అందిందని బోదవాడలోని రేవంత్‌ బంధువులు తెలిపారు. దీంతో బోదవాడలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. రేవంత్ తండ్రి ఆచంట రఘుబాబు పిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. తల్లి కొన్నాళ్ల క్రితం మరణించారు. ఒక్కగానొక్క కుమారుడు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య చదువుకుని తిరిగి వస్తాడనుకుంటే మృత్యువు కబళించిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు రేవంత్ ఇంటికి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..