Andhra Pradesh: బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అవయవదానం.. హెలికాప్టర్‌లో గుండె తరలింపు! ఎక్కడంటే…

| Edited By: Srilakshmi C

Dec 20, 2023 | 7:08 AM

అవయవ దానం ఓ గొప్ప సంకల్పం. తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపే ఓ అద్భుత కార్యక్రమం. అటువంటి అవయవదానం కార్యక్రమంకి వేదిక అయింది శ్రీకాకుళంలోని జెమ్స్ హాస్పిటల్. బ్రెయిన్ డెడ్ అయిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రాయవలసకు చెందిన పొట్నూరు రాజేశ్వరరావు (62) అవయవాలు దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. మెదడులో రక్తశ్రావo జరిగి ఈనెల 14న జెమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు రాజేశ్వరరావు. గత ఐదు రోజులుగా వెంటిలేటర్ పై ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు..

Andhra Pradesh: బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అవయవదానం.. హెలికాప్టర్‌లో గుండె తరలింపు! ఎక్కడంటే...
organs were airlifted to Tirupati SVIMS
Follow us on

రాయవలస, డిసెంబర్‌ 20: అవయవ దానం ఓ గొప్ప సంకల్పం. తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపే ఓ అద్భుత కార్యక్రమం. అటువంటి అవయవదానం కార్యక్రమంకి వేదిక అయింది శ్రీకాకుళంలోని జెమ్స్ హాస్పిటల్. బ్రెయిన్ డెడ్ అయిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రాయవలసకు చెందిన పొట్నూరు రాజేశ్వరరావు (62) అవయవాలు దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. మెదడులో రక్తశ్రావo జరిగి ఈనెల 14న జెమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు రాజేశ్వరరావు. గత ఐదు రోజులుగా వెంటిలేటర్ పై ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. అయినా చికిత్సకు ఏమాత్రం స్పందించ లేదు. దీంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైదులు గుర్తించి రాజేశ్వరరావు కుటుంబసభ్యులకు అవయవదానంపై కౌన్సిలింగ్ ఇచ్చారు. అతని భార్య, కుమారుడు తేజేశ్వర రావు అవయవదానంకి అంగీకరించటంతో ఆసుపత్రి వైద్యులు జీవన్ ధాన్ కి అప్లయ్ చేయగా అందుకు తగ్గ ఏర్పాట్లు చకచక జరిగిపోయాయి. అవయవ దానం కోసం రాజేశ్వరరావు గుండె, లివర్ పనిచేస్తాయని వైద్యులు గుర్తించి మంగళవారం వాటిని అతని నుండి సేకరించి అవి ఎవరికైతే అవసరమో వాళ్ళకి అమర్చేందుకు వెనువెంటనే అవయవాలను తరలించారు. గుండెను తిరుపతి లోని స్విమ్స్ కి తరలించగా, లివర్ ను విశాఖ లోని ఓ ప్రైవేట్( పినాకిల్)హాస్పిటల్ కి తరలించారు.

హెలికాఫ్టర్ లో గుండె తరలింపు..

అవయవదానం చేసినప్పుడు సేకరించిన అవయవాలను నిర్ణీత సమయంలోగా అవసరమైన వ్యక్తికి అమర్చాల్సి ఉంటుంది. ఎంత తొందరగా అమర్చ గలిగితే…వాటి పనితీరు అంత బాగా ఉంటుంది. నిర్ణీత సమయం దాటితే అవి పనికరాకుండా పోవడంతో పాటు దానికోసం పడిన కృషి అంతా వృధాగా పోతుంది. అందులోకి గుండెను తొలగించిన కేసుల్లో కేవలం 4గo.ల నుండి 6 గo.లు లోగా ఆమర్చాల్సి ఉంటుంది. అందుకే అవయవ దాన కార్యక్రమంలో అవయవాల తరలింపులో ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఎక్కడ జాప్యం జరగకుండా పోలీస్ ఎస్కార్ట్ తో గ్రీన్ ఛానల్ ద్వారా గమ్యస్థానంకి తరలింపు చేపడతారు. అవయవాల తరలింపుకు రోడ్డు మార్గంతో పాటు దూరాన్ని బట్టి అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ లను ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ క్రమంలోనే రాజేశ్వర రావు గుండెను తిరుపతికి తరలించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం దాని కోసం హెలికాప్టర్ ను సిద్దం చేసింది. శ్రీకాకుళo లోని జెమ్స్ హాస్పిటల్ ప్రాంగణం లోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేసి గుండెను హెలికాప్టర్ లో శ్రీకాకుళం నుండి విశాఖ ఎయిర్ పోర్ట్ కి అక్కడ నుండి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లో తిరుపతికి తరలించారు. లివర్ ను రోడ్డు మార్గం గుండా విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.

కేవలం 30 రోజుల వ్యవధిలోనే జెమ్స్ హాస్పిటల్ కేంద్రంగా ముగ్గురు బ్రెయిన్ డెడ్ పేషంట్ల అవయవదానాలు

జెమ్స్ హాస్పిటల్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం నలుగురు బ్రెయిన్ డెడ్ పేషంట్ల నుండి అవయవాలు సేకరించి అవయవదానాలు చేశారు. ఇటీవల కేవలం 30 రోజుల వ్యవధిలోనే ముగ్గురు అవయవదానాలు ఇచ్చారు. ఏడు నెలల క్రితం కిరణ్ చంద్ అనే 14 యేళ్ళ బాలుడుకి, కిందటి నెల 26న మౌనిక అనే 25యేళ్ళ సచివాలయ ఉద్యోగికి, మంగళవారం రాజేశ్వర రావు అనే వ్యక్తికి అవలయవాలను తొలగించి అవి అవసరమైన వాళ్ళకి అమర్చారు. మంగళవారం అవయవదానం చేసిన రాజేశ్వరరావుకు జెమ్స్ హాస్పిటల్ వైద్యులు, వైద్య-నర్సింగ్ సిబ్బంది పూలను జల్లి ఘన నివాళులు అర్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.