గోదావరిలో బోటు వెలికితీత… ఎన్ని మృతదేహాలు దొరికాయంటే!

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటును వెలికితీశారు. కాసేపటి క్రితమే ధర్మాడి సత్యం బృందం బోటును నీటిపైకి తీసుకొచ్చింది. డీప్ డైవర్లు నీటి అడుగు భాగం నుంచి లంగర్లు, తాళ్ల సాయంతో బోటును పైకి లాక్కొచ్చారు. కాకినాడ పోర్టు అధికారి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. మరికాసేపట్లో ఒడ్డుకు తీసుకురానున్నారు. ఐతే బోటులో ఐదు మృతదేహాలు ఉన్నట్లు సత్యం టీమ్ గుర్తించింది. 38 రోజులుగా ఆ మ‌ృతదేహాలు బోటులోనే ఉన్నాయి. బోటును […]

గోదావరిలో బోటు వెలికితీత... ఎన్ని మృతదేహాలు దొరికాయంటే!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 22, 2019 | 4:58 PM

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటును వెలికితీశారు. కాసేపటి క్రితమే ధర్మాడి సత్యం బృందం బోటును నీటిపైకి తీసుకొచ్చింది. డీప్ డైవర్లు నీటి అడుగు భాగం నుంచి లంగర్లు, తాళ్ల సాయంతో బోటును పైకి లాక్కొచ్చారు. కాకినాడ పోర్టు అధికారి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. మరికాసేపట్లో ఒడ్డుకు తీసుకురానున్నారు. ఐతే బోటులో ఐదు మృతదేహాలు ఉన్నట్లు సత్యం టీమ్ గుర్తించింది. 38 రోజులుగా ఆ మ‌ృతదేహాలు బోటులోనే ఉన్నాయి. బోటును వెలికితీయడంతో ఆ డెడ్‌బాడీలు బయటపడ్డాయి. అవి కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో ఎవరివనేది గుర్తించడం కష్టంగా మారింది. అటు బోటు కూడా పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

గతనెల 15న పాపికొండలు విహారయాత్రకు వెళ్తున్న లాంచీ …. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగింది. ఈ ప్రమాదం జరిగి దాదాపుగా 37 రోజులు తర్వాత బోటును బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 77 మంది ఉన్నారు. వీరిలో 39 మంది మృతిచెందగా 12 మంది గల్లంతయ్యారు. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. బోటును బయటకు తీయడంతో గల్లంతైన 12 మంది ఆచూకీ లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.