AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఇదెక్కడి యవ్వారం రా బాబు.. ఒక మగాడి కోసం ఇద్దరు మహిళలు పోటీ.. ఏం చేశారంటే

ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం అనేది కామన్..ఇలాంటి ఘటనలు మనం చాలానే చూసి ఉంటాం. కానీ ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయి కొట్టుకోవడం అనేది చాలా అరుదు.. అచ్చం ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒంగోలు జిల్లాలో వెలుగు చూసింది. ఒక యువకుడిపై మనసు పడిన ఇద్దరు మహిళలు.. అతడి కోసం గొడవలు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Andhra News: ఇదెక్కడి యవ్వారం రా బాబు.. ఒక మగాడి కోసం ఇద్దరు మహిళలు పోటీ.. ఏం చేశారంటే
Andhra News
Fairoz Baig
| Edited By: Anand T|

Updated on: Oct 26, 2025 | 7:17 PM

Share

ఒక యువకుడిపై ఇద్దరు మహిళలు మోజు పడ్డారు.. ఒంగోలులో కేటరింగ్‌ పనులు చేసుకుంటున్న ఆ ఇద్దరు మహిళలు స్నేహితులే.. ఒకరు సీనియర్‌, మరొకరు జూనియర్‌.. తమతో సన్నిహితంగా ఉంటున్న ఆ యువకుడితో ఈ ఇద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకుని ఎవరికివారు ఇదే జీవితం అన్నట్టుగా ఉంటున్నారు. ఈ క్రమంలో అతడికోసం ఆ ఇద్దరు మహిళల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఒక మహిళకు దూరమయ్యాడు ఆ యువకుడు. దీంతో ఈ వ్యవహారం కేసుల వరకు వెళ్ళింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలులోని చంద్రయ్య నగర్‌లో నివాసం ఉంటున్న స్నేహితులైన ఇద్దరు మహిళలలు.. కేటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ అక్కడే పనిచేస్తున్న ఓ యువకుడిపై మోజుపడి అతడితో విడివిడిగా సహజీవనం సాగిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ లైంగిక సంబంధాల కారణంగా ఇద్దరు మహిళల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 25న ఆరుగురు వ్యక్తులు వచ్చిన సీనియర్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లి మిర్యాలపాలెం సెంటర్ దగ్గర ఒక ఇంట్లో బంధించారు.

ఆ తర్వాత ఆమెను చిత్రహింసలు పెట్టి.. ఆమె బట్టలు ఊడదీసి దాడికి పాల్పడ్డారు. ఆపై గందరగోళం సృష్టించారు. దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టి వైరల్‌ చేశారు. అయితే ఎలాగోలా తన స్నేహితురాలి సాయంతో అక్కడి నుంచి తప్పించుకున్న సీనియర్‌ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.