Ram Mandir: అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేళ.. సినిమా థియేటర్‎లో ఆధ్యాత్మిక శోభ

భారతదేశం యావత్తు రామనామస్మరణలతో మర్మోగిపోయింది. ఎక్కడ చూసినా.. ఎటువైపు వెళ్లిన శ్రీరామ అనే భజనలతో ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆలయాలలో ఆధ్యాత్మిక శోభతో ఉట్టి పడుతోంది. పలు ఆలయాలలో హనుమాన్ చాలీసాలు, రామాయణ పారాయణాలు, కాషాయ జెండాలతో శోభాయాత్రలు ఘనంగా నిర్వహించారు.

Ram Mandir: అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేళ.. సినిమా థియేటర్‎లో ఆధ్యాత్మిక శోభ
Hanuman Theater Eluru

Edited By:

Updated on: Jan 22, 2024 | 7:32 PM

ఏలూరు, జనవరి 22: భారతదేశం యావత్తు రామనామస్మరణలతో మర్మోగిపోయింది. ఎక్కడ చూసినా.. ఎటువైపు వెళ్లిన శ్రీరామ అనే భజనలతో ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆలయాలలో ఆధ్యాత్మిక శోభతో ఉట్టి పడుతోంది. పలు ఆలయాలలో హనుమాన్ చాలీసాలు, రామాయణ పారాయణాలు, కాషాయ జెండాలతో శోభాయాత్రలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఇటీవల విడుదలైన హనుమాన్ సినిమా థియేటర్ల వద్ద సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయునికి పూజలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో సౌభాగ్య థియేటర్లో హనుమాన్ సినిమా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ డీసీసీ బ్యాంక్ చైర్మన్, సినీ నిర్మాత, థియేటర్ యజమాని ఐన కరాటం రాంబాబు పాల్గొన్నారు.

థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ సినిమాను వీక్షించేందుకు థియేటర్‎కు వచ్చిన ప్రేక్షకులకు సినిమా టికెట్‎తో పాటు మద్ది ఆంజనేయ స్వామి లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. హనుమాన్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతి టిక్కెట్ పై రూ.5 హనుమాన్ సినిమా నిర్మాతలు అయోధ్య రామాలయ నిర్మాణ ట్రస్ట్‎కు ఇస్తున్నారని, అలాగే దేశవ్యాప్తంగా హనుమాన్ చిత్రం ప్రదర్శించబడుతున్న అన్ని థియేటర్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే సినిమా ప్రదర్శించబడుతున్న అన్ని థియేటర్లను విద్యుత్ దీపాలతో అలంకరించారన్నారు. అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట జరగడం ఎన్నో దశాబ్దాల కలగా చెప్పుకొచ్చారు. ఆ స్వప్నం ఈ రోజు నెరవేరడం తనకు ఎంతో ఆనందంగా ఉందని రాంబాబు తెలిపారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us