AP Weather Alert: రానున్న నాలుగు రోజుల్లో ఏపీలో ఎండలు దంచికొట్టనున్నాయి. ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 26 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండడానికి ఓఆర్‌ఎస్, లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తీసుకోవాలని సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం పార్వతీపురంమన్యం 12, విజయనగరం 9, అనకాపల్లి 8, అల్లూరి సీతారామరాజు 6, కాకినాడ 3 మిగిలిన చోట్ల అక్కడక్కడ మొత్తం 41 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనకాపల్లి ,కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 38°C-39°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అనకాపల్లి ,కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమగోదావరి, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, విజయనగరం, ఏలూరు, పల్నాడు, నంద్యాల, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం,విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనకాపల్లి ,కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమగోదావరి, చిత్తూరు, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, విజయనగరం, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి , కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
తాజా వాతావరణ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Hyderabad News: క్షణికావేశంలో దారుణం.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ మహిళ ఏకంగా..