AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. ఈ ట్రైన్ సమయాల్లో మార్పు.. పూర్తి వివరాలు.!

బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్. ఈ ట్రైన్‌కు సంబంధించిన సమయాల్లో మార్పులు జరిగాయి. ప్రయాణీకులు ఇది గమనించాల్సిందిగా రైల్వే అధికారులు సూచించారు.

బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. ఈ ట్రైన్ సమయాల్లో మార్పు.. పూర్తి వివరాలు.!
Train
Ravi Kiran
|

Updated on: Jun 05, 2023 | 4:09 PM

Share

బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు అలెర్ట్. మరీ ముఖ్యంగా ఏపీ వాసులకు ఈ ముఖ్య గమనిక. 12510 నెంబర్‌తో గౌహతి-ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు జరిగాయి. ఈ టైమింగ్స్ చేంజ్ జూన్ 5న.. కేవలం ఒక్క రోజు మాత్రమేనని రైల్వే అధికారులు తెలిపారు. వాస్తవానికి సోమవారం ఉదయం 6.20 గంటలకు గౌహతి నుంచి బయల్దేరాల్సిన ఈ ట్రైన్.. మధ్యాహ్నం 3.20 గంటలకు స్టార్ట్ అవుతుంది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటన నేపధ్యంలో ఈ రైలు సమయాల్లో మార్పులు జరిగాయన్నారు రైల్వే అధికారులు.

ఇక ఈ ట్రైన్‌కు ఏపీలో పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ స్టేషన్లలో ఆగుతుంది. అటు 12665 నెంబర్‌తో హౌరా-కన్యాకుమారి మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా జూన్ 5న రద్దు చేసింది రైల్వేశాఖ. ఈ మేరకు ట్వీట్ చేసింది. ప్రయాణీకులు ఈ మార్పును గమనించాల్సిందిగా రైల్వే అధికారులు కోరారు. కాగా, ఈ ట్రైన్ టైమింగ్స్‌కు సంబంధించిన మార్పులను రైల్వే విచారణ నంబర్‌ 139 ద్వారా కానీ, లేదా రైల్వే స్టేషన్లలోని విచారణ కౌంటర్లలో తెలుసుకోవాలని సూచించారు.

Follow Us
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!