Visakha: ఇన్ స్టాగ్రామ్‌లో దోస్తీ.. రాత్రిపూట రాబరీ.. హడలెత్తిస్తున్న ‘నైట్ అవుట్ గ్యాంగ్’.. ఎక్కడ..?!

| Edited By: Surya Kala

Jul 21, 2023 | 5:56 PM

కొంతమంది యువకులు జల్సా లకు అలవాటు పడ్డారు. జులాయిగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరికొకరు ఇన్ స్టాగ్రామ్ పరిచయమయ్యారు. అందరి ఆలోచనలు దాదాపుగా ఒకటే కావడంతో.. 'నైట్ అవుట్' పేరుతో ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. చెడు వ్యసనాలకు బానిసై దారి దోపిడీలు ప్రారంభించారు.

Visakha: ఇన్ స్టాగ్రామ్‌లో దోస్తీ.. రాత్రిపూట రాబరీ.. హడలెత్తిస్తున్న నైట్ అవుట్ గ్యాంగ్.. ఎక్కడ..?!
Night Out Batch
Follow us on

చెడ్డి బనియన్ గ్యాంగ్.. ఇరానీ గ్యాంగ్.. తెలకపాముల గ్యాంగ్.. దండుపాళ్యం గ్యాంగ్.. ఇలా ఈ పేర్లు వినగానే.. కరడు కట్టిన నేరగాళ్లు, దొంగలు గుర్తొస్తారు. ఎందుకంటే ఆ గ్యాంగుల వ్యవహారాలు ఆ స్థాయిలో ఉంటాయి మరి. కానీ ఇప్పుడు నైట్ అవుట్ పేరుతో గ్యాంగ్ పేరుతో ఓ కుర్ర బ్యాచ్ సిద్ధమైంది. ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన వాళ్లంతా.. గ్రూప్ గా ఏర్పడి అర్ధరాత్రి పూట హల్చల్ చేస్తున్నారు. దారి కాసి.. దాడులు చేసి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఒక్క రోజులోనే చేసిన రెండు వరుస దోపిడీలు పోలీసులను పరుగులు పెట్టించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆధునిక ప్రపంచంలో.. నేరాలు కూడా అదే స్థాయిలో అప్డేట్ అయిపోతున్నాయి. కొత్త కొత్త నేరాలు.. కొత్త కొత్త  గ్యాంగులు పుట్టుకొస్తున్నాయి. ఒక్కో గ్యాంగ్ ఒక్కో రీతిలో నేరాలు చేస్తోంది. అయితే.. తాజాగా నైట్ అవుట్స్ పేరుతో సరికొత్త గ్యాంగ్ హల్చల్ చేసింది. రాత్రిపూట దారి దోపిడీలతో పోలీసులను పరుగులు పెట్టించింది. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమై.. అర్ధరాత్రి రోడ్లపై సంచరిస్తూ దారి దోపిడీలు చేస్తుంది ఈ గ్యాంగ్. ఎక్కడో తెలుసా..? ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో.. నేరగాళ్లు తమ చేతులకు పని చెబుతున్నారు. కొంతమంది పాత నేరస్తులే పదేపదే నేరాలు చేస్తుంటే.. మరికొన్ని కొత్త గ్యాంగ్ లు పుట్టుకొచ్చి..  నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ గ్యాంగ్.. విశాఖ సిటీలో దారి దోపిడీలకు పాల్పడుతోంది. అది కూడా అర్ధరాత్రి పూటే..! ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలే టార్గెట్ గా చేసుకొని డ్రైవర్లకు బెదిరించి దాడి చేసి దోచుకుంటుంది ఆ గ్యాంగ్.

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం.. రాత్రిపూట సంచారం..

ఇవి కూడా చదవండి

కొంతమంది యువకులు జల్సా లకు అలవాటు పడ్డారు. జులాయిగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరికొకరు ఇన్ స్టాగ్రామ్ పరిచయమయ్యారు. అందరి ఆలోచనలు దాదాపుగా ఒకటే కావడంతో.. ‘నైట్ అవుట్’ పేరుతో ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. చెడు వ్యసనాలకు బానిసై దారి దోపిడీలు ప్రారంభించారు. జల్సాల కోసం ఈజీ మనీ సంపాదించేందుకు రోడ్లపై పడ్డారు. అలా అని పగలు కాదు..కేవలం రాత్రిపూటే వాళ్ళ పని.

వాళ్లే ఆ గ్యాంగ్ టార్గెట్…!

ప్రతిరోజు రాత్రి మీట్ అయ్యేందుకు ఒక స్పాట్ ఫిక్స్ చేసుకుంటారు. ఇన్స్టాలో ఆ స్పాట్ ను పోస్ట్ చేస్తారు. చెప్పిన టైం కి అందరూ ఒక చోట చేరుతారు. అక్కడ నుంచి తమ పని ప్రారంభిస్తారు. శివారు ప్రాంతాలు సీసీ కెమెరాలు లేని ఏరియాలోని ఎంచుకుంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లపై సంచరిస్తూ.. లారీ డ్రైవర్లను ఆపి డబ్బుల కోసం బెదిరిస్తారు. ప్రశ్నిస్తే.. దాడి చేసి దోచుకుని పారిపోతారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లు పోలీసులను ఆశ్రయించరనేది వాళ్ల ఆలోచన. ఏడుగురు సభ్యుల్లో నలుగురు తప్ప మిగతా వారంతా.. మైనర్లేనని అంటున్నారు క్రైమ్ డిసిపి నాగన్న.

ఆ దోపిడీతో వెలుగులోకి గ్యాంగ్…

ఈనెల 16వ తేదీన అర్ధరాత్రి శీలానగర్ ప్రాంతంలో ఒడిస్సా నుంచి వచ్చిన ఓ లారీని ఆపారు. డ్రైవర్ లింగస్వామికి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించడంతో.. దాడి చేసి రెండు వేల నగదు సెల్ ఫోను ఎత్తుకెళ్లారు. మరో డ్రైవర్ ను కూడా దోచుకుని పారిపోయారు. తీవ్ర భయాందోళన చెందిన లారీ డ్రైవర్ లింగుస్వామి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన కంచరపాలెం, ఎయిర్పోర్ట్ క్రైమ్ పోలీసులు.. కూపీ లాగారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మూడు బైకులను సీజ్ చేశామని చెప్పారు క్రైమ్ డిసిపి నాగన్న.

పోలీసుల అలర్ట్ తో…

నిందితులంతా జల్సాలతో పాటు చెడు వ్యసనాలకు బానిస అయ్యారు. చదువులు మధ్యలోనే ఆపేశారు. పోలీసులకు ఫిర్యాదు అందింది ఒకటే. అదే రోజు రెండు ఘటనలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఇటువంటి ఘటనలు ఇంకా ఎక్కువే జరిగి ఉంటాయన్నది ఖాఖీల అనుమానం. ఇప్పుడిప్పుడే నేరాలు ప్రారంభించిన ఈ నైట్ అవుట్స్ గ్యాంగ్ ను పోలీసులు ఆటపట్టించారు. లేకుంటే మరిన్ని దాడులు దారి దోపిడీలు జరిగేవో..! ఇదే విషయం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..