బ్రాండ్ వైజాగ్, ఇదే ఇప్పుడు జీవీఎంసీ ముందున్న టార్గెట్. ఒకవైపు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు, మరోవైపు జీ-20 మీట్ కోసం ముస్తాబు చేస్తున్నారు. అయితే, ప్రపంచ పటంలో విశాఖకు మరింత గుర్తింపు తేవడమే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. బ్యూటిఫికేషన్ పేరుతో కొత్త బీచ్‌లు, కొత్త రోడ్లు, కొత్త పార్క్‌లు నిర్మిస్తున్నారు. మొన్నటివరకు ఒక లెక్క-ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టుగా ముస్తాబవుతోన్న వైజాగ్ సిటీ. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం సర్వాంగ సుందరంగా రెడీ అవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సాగర నగరం అద్దంలా మెరిసిపోతోంది. సరికొత్త అందాలను అద్దుకుంటూ ఆహా ఓహో అనేలా రూపురేఖలనే మార్చుకుంటోంది. కొత్త రోడ్లు, కొత్త పార్క్‌లు, కొత్త బీచ్‌లతో కళకళలాడుతోంది విశాఖ నగరం.
విశాఖ అంటే ఎవ్వరికైనా ముందు గుర్తొచ్చేది బీచ్‌లే, అది కూడా ఆర్కే బీచ్ లేదంటే రుషికొండ బీచ్. ఆ తర్వాతే ఏవైనా. అంతలా పర్యాటకులను అట్రాక్ట్ చేస్తాయ్ అక్కడి బీచ్‌లు. సాగర నగరానికి బీచ్‌లే అందం, ఆభరణం కూడా. ఆ అందాలకు అదనపు హంగులను జోడిస్తున్నారు అధికారులు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ జీ-20 మీట్‌లో భాగంగా కొత్త బీచ్‌లను శరవేగంగా రెడీ చేస్తున్నారు.
ఆల్రెడీ ఉన్న బీచ్‌లకు అదనంగా మరో రెండు కొత్త బీచ్‌లను సిద్ధంచేస్తోంది జీవీఎంసీ. జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్‌లో యుద్ధప్రాతిపదిన పనులు చేస్తోంది. సన్‌రే బీచ్ సహకారంలో కొత్త బీచ్‌లను తీర్చిదిద్దుతోంది జీవీఎంసీ. యాభై అడుగుల ఎత్తున్న 2వందల కొబ్బరి చెట్లను తెప్పించి జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్‌లో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నారు. బీచ్‌ల్లో అవసరమైన సౌకర్యాలన్నింటినీ ప్రొవైడ్ చేస్తున్నారు అధికారులు.
ఒకవైపు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, మరోవైపు జీ-20 మీట్‌కు విశాఖ వేదికగా నిలవడంతో అంతర్జాతీయస్థాయిలో బీచ్‌లను రెడీ చేస్తు్న్నామంటున్నారు జీవీఎంసీ కమిషనర్ రాజబాబు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన కమిషనర్… విశాఖలో చేస్తున్న బ్యూటిఫికేషన్ పనులను వివరించారు.
విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడమే లక్ష్యంగా కొత్త బీచ్‌ల ఏర్పాటు జరుగుతోంది. అంతర్జాతీయ సదస్సులకు రానున్న దేశీ విదేశీ ప్రతినిధులు, అంబాసిడర్లు, బిజినెస్‌మెన్లను ఆకట్టుకోవడమే బ్యూటిఫికేషన్ యొక్క మెయిన్ టార్గెట్. అందులో భాగంగా విశాలమైన రోడ్లను నిర్మిస్తున్నారు. కొత్త పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. టోటల్‌గా విశాఖ నగర రూపురేఖల్నే మార్చేస్తూ సర్వాంగ సుందరంగా రెడీ చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..