Vijaya Saireddy: వైఎస్ షర్మిల ఎపిసోడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి
టీవీ9 క్రాస్ ఫైర్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు అంశాల్లో ఆయన చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. వైఎస్ జగన్ సారథ్యంలో మరోసారి విజయం సాధిస్తామని ధీమా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో 175 కి 175 అసెంబ్లీ స్థానాలను టార్గెట్‌గా పెట్టుకుని వైసీపీ దూసుకుపోతోంది. అటు 25 పార్లమెంట్ స్థానాలు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు విజయసాయిరెడ్డి.
ఈ క్రమంలోనే టీవీ9 క్రాస్ ఫైర్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు అంశాల్లో ఆయన చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో ప్రస్తుతం కాకరేపుతున్న వలంటీర్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. అలాగే వైఎస్ షర్మిల ఎపిసోడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు విజయసాయి. అయితే, తెలంగాణలో పార్టీ పెట్టి.. మళ్లీ ఏపీ వైపు రావడం, కాంగ్రెస్‌లో చేరడం షర్మిల రాజకీయంగా చేసిన పెద్ద తప్పిదమని చెప్పారు విజయసాయి.
