AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: ఆ వైసీపీ ఎంపీతో టీడీపీ మైండ్ గేమ్.. తిప్పి కొట్టిన సీనియర్ నేత..

వైసీపీకి కంచుకోట లాంటి సింహపురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్‎గా మారారు. వారంతా టీడీపీతో కలిశారు. ఇపుడు మరో వికెట్ పడుతుందా.. అంటూ డిస్కషన్ నడుస్తోంది. సీనియర్ మోస్ట్ లీడర్, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కేంద్రంగా ఈ చర్చ జరుగుతోంది. అయితే ఆ వార్తలకు ఎంపీ ఇస్తున్న క్లారిటీ ఇదే.. ఆదాల ప్రభాకర్ రెడ్డి.. పాతికేళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్నారు. జిల్లాలో సీనియర్ నేత.

YSRCP: ఆ వైసీపీ ఎంపీతో టీడీపీ మైండ్ గేమ్.. తిప్పి కొట్టిన సీనియర్ నేత..
Nellore Mp A Prabhakar Redd
Ch Murali
| Edited By: Srikar T|

Updated on: Jan 18, 2024 | 10:52 AM

Share

వైసీపీకి కంచుకోట లాంటి సింహపురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్‎గా మారారు. వారంతా టీడీపీతో కలిశారు. ఇపుడు మరో వికెట్ పడుతుందా.. అంటూ డిస్కషన్ నడుస్తోంది. సీనియర్ మోస్ట్ లీడర్, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కేంద్రంగా ఈ చర్చ జరుగుతోంది. అయితే ఆ వార్తలకు ఎంపీ ఇస్తున్న క్లారిటీ ఇదే.. ఆదాల ప్రభాకర్ రెడ్డి.. పాతికేళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్నారు. జిల్లాలో సీనియర్ నేత. 1999లో అల్లూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసి గెలుపొందారు. మంత్రిగా కూడా పనిచేశారు. 2004లో నియోజకవర్గం.. అలాగే పార్టీ మారి కాంగ్రెస్ నుంచి సర్వేపల్లిలో మాజీమంత్రి సోమిరెడ్డిపై రెండు సార్లు విజయం సాదించారు. 2019లో వైసీపీ తరపున నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీచేసి గెలుపొందారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి పోల్ మేనేజ్మెంట్‎లో ఎక్స్పర్ట్ అనే పేరుంది. ఒక్క సారి మినహా పోటీచేసిన ప్రతిసారీ ఆదాల గెలుస్తూనే వచ్చారు. 2019 ఎన్నికలకు కొద్దిరోజులు ముందు టీడీపీ వీడి వైసీపీలో చేరారు. నెల్లూరు లోక్ సభ నుంచి గెలుపొందారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి దూరం కావడంతో నెల్లూరు రూరల్ ఇంచార్జ్‎గా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు అధినేత జగన్. నెల్లూరు రూరల్ నుంచి ఈ సారి ఎన్నికల్లో పోటీలో దింపింది అధిష్టానం. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమవడం.. ఆదాల కూడా పార్టీని వీడుతారంటూ వస్తున్న వార్తలతో డిస్కషన్ బాగానే జరిగింది. అయితే ఆదాల ఈ వార్తలపై మీడియాకు క్లారిటీ ఇచ్చారు. అయితే ఆదాల కోసం టీడీపీ గట్టిగానే ప్రయత్నాలు చేసింది. అడిగిన చోట టికెట్టు ఇస్తామని చెప్పినా ఆదాల మాత్రం పార్టీ మారడానికి ససేమిరా అన్నారట. దీంతో మళ్లీ ఆదాల వేదికగా పుకార్లు మొదలయ్యాయి. నారా లోకేష్‎తో ఆదాల భేటీ అంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆదాల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి ప్రచారం చేస్తే న్యాయపరంగా చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. జరుగుతున్న ప్రచారం పట్ల ఆదాల అసలు విషయం బయట పెట్టారు. పార్టీలోకి రానందుకు టీడీపీ తనను డ్యామేజ్ చేసేందుకు మైండ్ గేమ్ ఆడుతోందని అంటున్నారు. ఒక టీమ్‎ను జనంలోకి పంపి ఆదాల చివర వరకు పార్టీలో ఉండరనే మాటలను ప్రజల్లోకి చేరేలా వ్యూహంతో ఇలా చేస్తోందని తెలిపారు. టీ షాపులు, ప్రధాన కూడళ్లలో సామాన్యుల్లా కలిసిపోయిన ఒక బృందం ఆ ఎంపీని డ్యామేజ్ చేస్తోందట. తన ప్రత్యర్ధులు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానే తప్ప వైసీపీని వీడి టీడీపీకి వెళ్ళేది లేదని తెగేసి చెబితున్నారు ఆదాల. దీంతో వచ్చిన వార్తలన్నీ నీలివార్తలుగా మారిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..