AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గోదారోళ్లా మజాకా.. కొత్త అల్లుడికి 260 వెరైటీలతో అదిరిపోయే విందు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. అసలు సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్లు, కోడిపందాలు, పిండి వంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత పెద్దదిగా ఉంటుంది. తెలుగు ప్రజల మదిలో సంక్రాంతికి మించిన పెద్ద పండుగ ఏది ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఏటా సంక్రాంతి పేరుతో ఉభయగోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందాలు వీక్షించడం కోసం వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు, అతిధులు ప్రత్యేకంగా..

Andhra Pradesh: గోదారోళ్లా మజాకా.. కొత్త అల్లుడికి 260 వెరైటీలతో అదిరిపోయే విందు
Godawari District Family Feast
B Ravi Kumar
| Edited By: Srilakshmi C|

Updated on: Jan 17, 2024 | 7:29 PM

Share

ఏలూరు, జనవరి 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. అసలు సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్లు, కోడిపందాలు, పిండి వంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత పెద్దదిగా ఉంటుంది. తెలుగు ప్రజల మదిలో సంక్రాంతికి మించిన పెద్ద పండుగ ఏది ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఏటా సంక్రాంతి పేరుతో ఉభయగోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందాలు వీక్షించడం కోసం వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు, అతిధులు ప్రత్యేకంగా వస్తుంటారు. అంతేకాక సినీ రాజకీయరంగ ప్రముఖులు సైతం సంక్రాంతి వేడుకలలో పాల్గొని ఆనందిస్తారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే గోదావరి జిల్లాల్లో కనిపించే సంక్రాంతి సందడే వేరే లెవెల్. గోదావరి జిల్లాలకు మరో ప్రత్యేకత ఉంది. అదేంటో మీకు తెలుసా… అయితే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సంక్రాంతికి కోడిపందాలు ఒకెత్తయితే మరోపక్క కొత్తగా పెళ్లయిన అల్లుళ్ళను ఆటపాటలు, సరదాలు విందు భోజనాలతో గౌరవించడం ఆక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. అందుకే కొంతమంది మగ పిల్లలకు సంబంధాలు చూసేటప్పుడు గోదావరి జిల్లాలకు చెందిన ఆడపిల్లలనే పెళ్లి చేసుకోవాలనే ఫిక్స్ అయిపోతారు. గోదావరి జిల్లాలలో అల్లుడికి జరిగే మర్యాదలు ఇంకెక్కడ జరగవు. అయితే ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా కొత్తగా అత్తవారింటికి వచ్చిన అల్లుళ్లకు వారి అత్తమామలు ప్రత్యేక వంటకాలతో ఇందు భోజనాలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ కొత్త అల్లుడికి తన అత్తమామలు 260 రకాల ప్రత్యేకమైన పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మహంకాళి నాగ పవన సింధును అనే యువతకి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడకి చెందిన చరణ్ అనే యువకుడితో గత సంవత్సరం నవంబర్ నెలలో వివాహమైంది. వీరి వివాహాన్ని ఇరుకుటుంబ పెద్దలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెళ్లయిన తర్వాత మొదటి సంక్రాంతి పండుగ రావడంతో చరణ్ అత్తమామలు అతనికి ప్రత్యేక వంటకాలతో విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా 260 వెరైటీలతో వివిధ రకాల పిండి వంటలు వండించారు. అనంతరం కొత్తజంటైన చరణ్ సింధులకు వారు ప్రత్యేకంగా తయారు చేయించిన పిండి వంటలను వడ్డించి కొసరి కొసరి తినిపించారు. కొత్త సంవత్సరంలో కొత్త జంటతో కలిసి కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా గడిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.