Andhra Pradesh: కేంద్రానికి ఫిర్యాదు చేస్తా.. ఫోన్ ట్యాపింగ్‌పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన కోటంరెడ్డి..

|

Feb 01, 2023 | 12:31 PM

ఫోన్ ట్యాపింగ్ ఆడియోను మీడియా ముందు వినిపించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన స్నేహితుడితో మాట్లాడిన సంభాషణను వినిపించిన కోటంరెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు వాట్సాప్ నంబర్

Andhra Pradesh: కేంద్రానికి ఫిర్యాదు చేస్తా.. ఫోన్ ట్యాపింగ్‌పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన కోటంరెడ్డి..
Kotamreddy Sridhar Reddy
Follow us on

తనఫోన్ ట్యాపింగ్ జరిగిందటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. మీడియా ముందుకు వచ్చిన ఆయన.. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అందుకు సంబంధించిన ఆడియో టేప్‌ను ఆయన బయటపెట్టారు. అంతేకాదు.. తన ట్యాప్ అవుతున్న విషయాన్ని రాష్ట్ర ఇంటెలిజెంట్స్ చీఫ్ సీతారామాంజనేయులు తెలిపారని ప్రకటించారు. ఇదే వ్యవహారంపై మంగళవారం నాడు ప్రెస్‌మీట్ పెట్టి మరీ సంచలన ప్రకటన చేశారు. వైసీపీలో ఒక మీదట కొనసాగే ప్రసక్తే లేదన్నారు. అవమానాలను భరిస్తూ ఇంకా కొనసాగాల్సిన అవసరం లేదన్నారు. తన ఫోన్ ట్యాప్ అవలేదని మంత్రులు అంటున్నారని, ఇదిగో ప్రూఫ్స్ అంటూ ఆడియో టేప్‌ను బయటపెట్టారు. నేను చూపేది తప్పు అని మంత్రులు నిరూపించగలరా? అని ప్రశ్నించారు కోటంరెడ్డి.

‘మనకోసం పని చేసిన కార్యకర్తలు బాగుండాలని కోరుకునే వాడిని. సీఎం జగన్ పై నేను ఎప్పుడూ విమర్శలు చేయలేదు. సీఎం ఆమోదించిన అభివృద్ధి పనుల నిధులు రానందుకు ఫైనాన్స్ సెక్రటరీ రావత్ పై మాత్రమే మాట్లాడాను. అనేక అవమానాలు భరించా. రాష్ట్రంలో సీఎం తలపెట్టిన గడప గడప ప్రారంభమైంది నెల్లూరు రూరల్ లోనే. జగన్ గౌరవం పెరిగేందుకు నెల్లూరు రూరల్ లో కష్టపడ్డా. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే తప్పా? ఫోన్ ట్యాపింగ్ చేస్తూ దొంగ చాటుగా వినడం ఏమిటి? నాతో సన్నిహితంగా ఉండే ఐపీఎస్ అధికారి నా ఫోన్ ట్యాపింగ్‌లో ఉందని చెప్పారు. ముందు నేను నమ్మలేదు.. నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారని అనుకున్నా.. 20 రోజుల ముందు ట్యాపింగ్ కి సంబంధించిన ఆధారం దొరికింది. సీఎం జగన్ లేదా సజ్జల చెబితేనే ట్యాపింగ్ చేసి ఉంటారు. మీడియా సాక్షిగా నాపై నిఘా ఎందుకని ఇంటిలిజెన్స్ అధికారులను ప్రశ్నించాను.’

‘నన్ను అనుమానించే చోట నేను ఉండలేను. ఇంకా 15 నెలలు సమయం ఉంది. అయినా నేను నటిస్తూ ఉండలేను. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా. నన్ను వివరణ అడగకుండానే.. నెల్లూరు రూరల్ కి ఇంచార్జ్ ని ప్రకటిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అవాస్తవమని బాలినేని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నేను బయటకు వెళ్లే పరిస్థితి మీరు తెచ్చారా? నేను వెళుతున్నానా? ఆధారాలు బయట పెడుతున్నా.. ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. కేంద్రం సీఎం జగన్, సజ్జల, విజయ సాయి రెడ్డి ఫోన్ లు ట్యాప్ చేస్తే.. మీకు తెలిస్తే మీ స్పందన ఏవిధంగా ఉంటుంది? ఆలోచించండి. తప్పు చేసింది మీరు.. ట్యాపింగ్ జరగలేదని అంటున్నారు. మా రెండు ఫోన్లు రికార్డు అయ్యే అవకాశం లేదు. ఇంటిలిజెన్స్ చీఫ్ సీతా రామాంజనేయులు నాకు ఫోన్ చేసి నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు చెప్పారు. ఆ ఆడియో కూడా నాకు పంపారు.’’ అని ప్రెస్‌మీట్ వేదికగా సంచలన వివరాలు బయటపెట్టారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రానికి పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని, ఆధారలు కేంద్రానికి సమర్పిస్తానని తెలిపారు కోటంరెడ్డి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..