Boy Missing: నెల్లూరు జిల్లాలో అడవిలో తప్పిపోయిన మూడేళ్ళ సంజు కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 8వ రోజు డాగ్ స్క్వ్వాడ్ ద్వారా పోలీసులు ఆచూకీ కోసం ప్రయత్నాలు చేపట్టారు. అయితే ఇవ్వాల తనిఖీ చేపట్టిన ప్రాంతంలో బాబు సంచరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాల సాయంతో బాలుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులతో పాటు.. గ్రామస్తులు సైతం బాలుడి కోసం అడవిలో గాలింపు చేపట్టారు. సంజు ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు, గ్రామస్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇవాళ డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేపట్టగా.. ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన డాగ్ స్క్వాడ్.. అక్కడి నుంచి వెనక్కు రావడంతో సెర్చ్ ఆపరేషన్ ఆగిపోయింది. ఇంత వెతికినా.. అటవీ ప్రాంతంలో ఎక్కడా సంజు జాడ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే, బాబు అడవుల నుంచి రోడ్డుపైకి వెళ్లాడా? అనే కోణంలో ఆలోచిస్తున్నారు పోలీసులు. ఒకవేళ బాబు రోడ్డుపై ఎవరికైనా దొరికితే తమ వెంట తీసుకెళ్లారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జూన్ 29వ తేదీన ఉయ్యాల పల్లి అడవుల్లో మూడేళ్ల బాలుడు సంజు తప్పిపోయాడు. తండ్రి మేకల కాపరి కావడంతో తండ్రిని అనుసరిస్తూ సంజు అడవిలోకి వెళ్లాడు. అలా అడవిలోకి వెళ్లిన బాలుడి ఆచూకీ 8 రోజులైనా లభ్యం కాలేదు. మరోవైపు తప్పిపోయిన బాబు కోసం తల్లిదండ్రులు బుజ్జ్య, వరలక్ష్మి బోరున విలపిస్తున్నారు. తమ బాబును క్షేమంగా ఇప్పించాలంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. 8 రోజులుగా ఆ తల్లిదండ్రులు పడుతున్న నరక యాతన చూసి స్థానిక ప్రజలు సైతం ఆవేదన చెందుతున్నారు. సంజు కోసం వారు సైతం తీవ్రంగా గాలిస్తున్నారు.
Also read: