నంద్యాల, సెప్టెంబర్ 2023: తీగ లాగితే డొంక కదిలినట్లు.. డోన్ పోలీసులకు దొరికిన బీహార్ దొంగల ముఠాను పోలీసులు తమదైన స్టైల్ లో విచారిస్తే నివ్వురు గప్పే నిజాలు వెల్లడించడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ కు గురయ్యారు. వారు చెప్పిన వివరాలతో అన్ని రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీహార్ ఏటీఎం దొంగలు యదేచ్చగా రెక్కీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏ ప్రాంతంలో ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. జనసంచారం లేని ఏటీఎం సెంటర్లపై ఎక్కువగా రెక్కీ నిర్వహిస్తారు. ఆ ప్రాంతాల్లో జన సందోహాలు ఏ సమయానికి నిర్మానుష్యంగా మారుతాయి. ఏటీఎంలో ఎంత నగదు జమ చేస్తున్నారో రెక్కీ నిర్వహించి ఇట్లే పసిగట్టేస్తారు. ఏటీఎం చోరీకి ఎలాంటి ఆయుధాలు ఉపయోగించాలో చోరికి బయలు దేరే ముందే నిర్ణయించు కుంటారు. రెక్కీ టీం చోరీ చేసే బీహార్ గ్యాంగ్ కి వీరి సమాచారం మేరకు అక్కడి నుండి బయలు దేరి పోలీసుల కళ్ళు కప్పి రాష్ట్ర, అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను సులువుగా దాటివేస్తూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి బీహార్ గ్యాంగ్ చొరబడుతున్నారు.
వీరి చోరీలు అచ్చం ఖాకీ సినిమాను తలపిస్తాయి. చోరీ సమయంలో ఎవరన్నా అడ్డుకున్నారో వారి మారనాయుధాలకు నెత్తురు చింతాల్సిందే అంత కరుడుగట్టిన దొంగలు రాష్ట్రంలోకి యదేచ్చగా చొరబడుతుంటే పోలీసులు మాత్రం ఎందుకు బీహార్ గ్యాంగ్ ప్రయాణించే వాహనాలను పసిగట్టలేకపోతున్నరన్నదే ప్రశ్నార్థకం. ఇతర రాష్ట్ర పోలీసులు బీహార్ గ్యాంగ్ పై పెట్టిన దృష్టి ఏపీ పోలీసులు ఎందుకు పెట్టలేకపోతున్నారు. ఏటీఎం సెంటర్లోకి చొరబడి గ్యాస్ సిలిండర్లు గ్యాస్ కట్టర్లు ఇనుప రాడ్ల సహాయంతో క్షణాల్లో ఏటీఎం నగదును దోచుకొని నగదును కారులో తీసుకొని వెళ్లి వెంటనే లారీలో ఉన్న మరి కొంతమందికి ఆ నగదును అప్పజెప్పి వీరు మరొక ప్రాంతానికి చోరీకి బయలుదేరి వెళ్తారు. లారీలో నగదు వెళ్తుందని ఎవరు పసిగట్టలేరు దొంగలు వచ్చిన కారు వైపే పోలీసుల దృష్టిని మరల్చి నగదును రాష్ట్రాలు దాటించేస్తున్నారు. బీహార్ గ్యాంగ్ నంద్యాల జిల్లా డోన్ కర్నూలు జిల్లా పలు ప్రాంతాల్లో ఇదే గ్యాంగ్ చూర్గి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బీహార్ గ్యాంగ్ రెండు టీములు ఉంటాయి. బీహార్ గ్యాంగ్ లో రెండు టీములుగా విడిపోయి ఒకరు రెక్కి నిర్వహించి ఆ ప్రాంతాల వివరాలను చోరీకి పాల్పడడానికి అనుకూలమైన ఏటీఎం సెంటర్లో నించుకొని వాటి వివరాలను మరొక గ్యాంగ్ కు మాస్టర్ ప్లాన్ ను పంపిస్తారు.
అక్కడి నుండి బీహార్ గ్యాంగ్ బయలుదేరి రాష్ట్రాల చెక్పోస్ట్ దాటు బయలుదేరిన లారీ ముందర మరొక పైలట్ వాహనాలు జాతీయ రహదారిపై వెళ్తూ పోలీసుల వాహనాల తనిఖీల వివరాలు వారి గ్యాంగ్ కు సిగ్నల్ ఇస్తుంటారు ఒక రోజుకు ఇన్ని కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే చేయాలని ఫిక్స్ చేసుకుంటారు. హర్యానా నుండి తెలంగాణ రాష్ట్రం వైపు నుండి ఏపీ వైపు వస్తున్న బీహార్ ఏటీఎం దొంగల ముఠా సమాచారం హర్యానా పోలీసులకు సమాచారం రావడం తో వెంబడించారు. గమనించిన దొంగలు వారి పైలట్ వాహనాలు తప్పించుకొని తమ స్విఫ్ట్ కార్, ట్రక్కును తెలంగాణ రాష్ట్ర చెక్పోస్ట్ ను దాటుకొని ఆంధ్ర ప్రదేశ్ వైపు మళ్ళించడం తో కర్నూలు దాటి పోవడంతో డోన్ పోలీసులను, జిల్లా పోలీసు అధికారులు అలర్ట్ చేశారు. నంద్యాల జిల్లా డోన్ పోలీసులకు హర్యానా పోలీసులు సైతం సమాచారం చెరవేసి అలర్ట్ చేసి ఎలాగైనా వారు ప్రయాణిస్తున్న బీహార్ దొంగల ముఠాను పట్టుకోవాలని సూచించారు. అలర్ట్ అయిన పోలీసులు జాతీయ రహదారి 44 పై వాహనాలు అడ్డుపెట్టి దొంగల ముఠా ను అదుపులోకి తీసుకున్నారు.
వీరు ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కార్ భారీ ట్రక్కుని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న చోరీకి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు గ్యాస్ కట్టర్లు మారణాయుధాలను డోన్ పోలీసులు హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకుని దొంగలను అదుపులోకి తీసుకొని స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించి దొంగల ముఠాను విచారిస్తున్నారు. గతంలో డోన్, కర్నూలు ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగిన ఏటీఎం చోరీల తో సంబంధం ఉందా అని ఆరా తీస్తున్నారు. వీరి వేలిముద్రలను సేకరించి చోరీ జరిగిన ఏటీఎం సెంటర్లో వేలిముద్రలను పరిశీలిస్తున్నారు. వీరంతా బీహార్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం నంద్యాల కర్నూలు పోలీసు ఉన్నత అధికారులు డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని నిందితుల చోరిల సమాచారాన్ని సేకరిస్తున్నారు. రెక్కీ నిర్వహించాకే ఏపీలో ఏటీఎంలో చోరీకి పాల్పడడానికి వచ్చినట్లు తెలుస్తోంది. వారి నుండి భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మాత్రం విచారణను రహస్యంగా ఉంచుతున్నారు. సమాచారం అడిగిన మీడియా వారికి త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం అంటున్నారు. ఇలాంటి బీహార్ గ్యాంగులు రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా చెక్ పోస్టుల పనితీరుపై ప్రత్యేక నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.