బాలయ్యకు హిందూపూర్ ప్రజల షాక్..అసలు ఏం జరిగిందంటే..?
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఊహించని అనుభవం ఎదురైంది. నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన బాలయ్యను లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. బాలకృష్ణ హిందూపురానికి వస్తున్నారన్న విషయం తెలుసుకుని లేపాక్షి-హిందూపురం ప్రధాన రహదారిపై విద్యార్థులు, గ్రామస్థులు బైఠాయించారు. లేపాక్షి-హిందూపురం మెయిన్‌రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకోసం భూమిపూజ చేసి సంవత్సరం కావస్తున్నా పనులు ఇంకా పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే వద్ద గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థుల సమస్యపై స్పందించిన బాలకృష్ణ సంబంధిత అధికారులతో మాట్లాడి […]
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఊహించని అనుభవం ఎదురైంది. నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన బాలయ్యను లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. బాలకృష్ణ హిందూపురానికి వస్తున్నారన్న విషయం తెలుసుకుని లేపాక్షి-హిందూపురం ప్రధాన రహదారిపై విద్యార్థులు, గ్రామస్థులు బైఠాయించారు. లేపాక్షి-హిందూపురం మెయిన్‌రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకోసం భూమిపూజ చేసి సంవత్సరం కావస్తున్నా పనులు ఇంకా పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే వద్ద గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థుల సమస్యపై స్పందించిన బాలకృష్ణ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు వెనక్కి తగ్గారు.
వాస్తవానికి గత ఎన్నికలలో స్టేట్ మొత్తం టీడీపీకి నెగటీవ్ వేవ్ వీస్తున్న సమయంలో కూడా బాలయ్య అలవోకగా విజయాన్ని సాధించారు. మరీ ముఖ్యంగా రామలసీమలో మాజీ సీఎం చంద్రబాబు, పయ్యావులు కేశవ్, బాలకృష్ణ తప్ప టీడీపీ నుంచి ఎవరూ విజయం సాధించలేదు. దాదాపు 16వేల పైచిలుకు మెజార్టీతో బాలయ్య విజయ దుందు:భి మోగించారు. అందుకు ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్దే కారణమని వార్తలు వినిపించాయి. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలో ఉండంటంతో రోడ్డు వేసేందుకు నిధులు మంజూరు అవ్వడంలేదని స్థానిక టీడీపీ నేతలు చెబుతున్నారు.