Andhra Pradesh: ‘టీకా’ వేస్తామంటూ వచ్చింది.. కట్ చేస్తే పరుగో పరగు.. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..

Andhra Pradesh: నర్స్‌లా గెటప్ వేసుకుంటుంది.. ఎవరూ లేని సమయంలో వస్తుంది.. టీకా అని మాయ మాటలు చెబుతుంది. అది నమ్మి కాస్త ఏమరపాటుగా ఉండగానే..

Andhra Pradesh: ‘టీకా’ వేస్తామంటూ వచ్చింది.. కట్ చేస్తే పరుగో పరగు.. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..
Covid Vaccine Drive

Updated on: Aug 21, 2022 | 7:02 PM

Andhra Pradesh: నర్స్‌లా గెటప్ వేసుకుంటుంది.. ఎవరూ లేని సమయంలో వస్తుంది.. టీకా అని మాయ మాటలు చెబుతుంది. అది నమ్మి కాస్త ఏమరపాటుగా ఉండగానే.. తన పని పూర్తి చేసుకుని అక్కడి నుంచి పరారవుతుంది. అయితే, ఆమె టక్కుటమార విధ్యలకు చెక్ పెట్టారు గుంటూరు పోలీసులు. టీకా పేరుతో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న యువ చీటర్‌ను పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కిలాడీ లేడీ చోరీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కరోనా టీకా పేరుతో యువతి దొంగతనాలకు పాల్పడుతోంది. తాజాగా కరోనా టీకా వేస్తానంటూ వచ్చి ప్రభావతి అనే మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెల్లింది. దాంతో బాధితురాలి నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని పట్టుకున్నారు. నిందితురాలు పేరు చంద్రకళ అని, ఆమె నర్సింగ్ చేసినట్లు గుర్తించారు. అయితే, చెడు వ్యసనాలకు బానిస అయిన నిందితురాలు.. ఇలా దొంగతనాలకు పాల్పడుతూ జల్సాలు చేస్తోందన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా దొంగిలించిన సొత్తుతో ఫేక్ నెంబర్ ప్లేట్ ఉన్న బైక్‌పై తప్పించుకు తిరుగుతోంది. కాగా, నిందితురాలి వద్ద నుంచి రెండు బంగారు గొలుసులు, ఒక సుజుకీ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితురాలి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 4 లక్షలు ఉంటుందని అంచనా వేశారు అధికారులు.

Robbery Case

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..