Video: బీభత్సం సృష్టించిన లారీ.. CCTV ఫుటేజ్ చూస్తే వణుకు పుట్టాల్సిందే..
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజా వద్ద లారీ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. హైస్పీడ్‌లో దూసుకెళ్లిన లారీ టోల్ ప్లాజా కౌంటర్లను ఢీకొట్టింది. సిబ్బంది అప్రమత్తత వల్ల ప్రాణనష్టం తప్పింది. సీసీటీవీ ఫుటేజ్‌లోని భయంకర దృశ్యాలు అందరినీ కలవరపెట్టాయి.
అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఏ దేవుడు కరుణించాడేమో గాని.. రెప్పపాటులో వారంతా బతికి బట్ట కట్టారు. ఆ లారీ బీభత్సం కళ్ళ ముందు చూసిన వాళ్లంతా తేరుకోలేకపోతున్నారు. ఆ తర్వాత సిసి ఫుటేజ్ దృశ్యాలు చూసి గుండెలు పట్టుకున్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. విశాఖ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న లారీ.. అక్కడకు వచ్చేసరికి ఒక్కసారిగా అదుపుతప్పింది. టోల్ గేట్ వద్ద ఆగవలసిన లారీ.. హై స్పీడ్ లో దూసుకెళ్లింది. టోల్ ప్లాజా కౌంటర్ల పైకి దూసుకెళ్లింది. ఒక కౌంటర్లో ఆగాల్సిన లారీ మరో కౌంటర్ పైకి దూసుకెళ్లింది. బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న మరో వ్యాన్నూ ఢీకొట్టి.. ఆగింది. అయితే అప్పటికే పరిస్థితిని గమనిస్తూ ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది అప్రమత్తమై పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. అయితే.. కళ్ళముందే ఆ బీభత్సాన్ని చూసిన టోల్ ప్లాజా సిబ్బంది.. కాస్త తేరుకున్నాక సిసి ఫుటేజ్ ను పరిశీలించారు. ఆ దృశ్యాలు చూసి గుండెలు పట్టుకున్నారు. పోలీసుల కేసు నమోదు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




