Narayana Vs Nagababu: ఆయన అన్నం తినడం మానేసి చాలా కాలం అయిందంటూ సీపీఐ నారాయణకు నాగబాబు ఘాటు రిప్లై

చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా రిప్లై ఇచ్చారు.

Narayana Vs Nagababu: ఆయన అన్నం తినడం మానేసి చాలా కాలం అయిందంటూ సీపీఐ నారాయణకు నాగబాబు ఘాటు రిప్లై
Narayana Vs Nagababu

Updated on: Jul 20, 2022 | 10:59 AM

Narayana Vs Nagababu: తన అన్న మెగాస్టార్ చిరంజీవిని ఎవరైనా తీవ్రమైన విమర్శ చేసినప్పుడు.. వెంటనే మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తారు. తన అన్నదమ్ములపై తీవ్ర వ్యాఖ్యలు చేసినవారికి తనదైన శైలిలో సమాధానం చెబుతూ ఉంటారు.. తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా రిప్లై ఇచ్చారు.

కొంత మంది చేసిన తెలివితక్కువ.. వెర్రి వ్యాఖ్యలపై జన‌సైనికులు,‌ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే.. సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి.. కేవలం ఎండి గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మన మెగా అభిమానులందరూ వెళ్లి నారాయణతో గడ్డి తినడం మాన్పించి.. కాస్త అన్నం పెట్టండని సూచన చేశారు. తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు నాగబాబు.

ఇవి కూడా చదవండి

 

 

అల్లూరి సీతారామరాజు జయంతి రోజు నిర్వహించిన విగ్రహావిష్కరణ సమయంలో సూపర్‌ స్టార్‌ కృష్ణను ఆహ్వానిస్తే బాగుండేదని.. అలా కాకుండా ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని సభా వేదికపైకి తీసుకురావడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ ల్యాండ్‌మైన్‌ లాంటి వారని, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలీదు అంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.. మరి ఇప్పుడు తనపై నాగబాబు చేసిన వ్యాఖ్యలకు సీపీఐ నారాయణ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..